India vs England : సెకండ్ ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన భారత్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ లో రాణించింది. భారీగా పరుగులు చేసింది. చివరకు 466 రన్స్ కు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 368 పరుగుల

India Vs England
India vs England : ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులకే కుప్పకూలిన టీమిండియా బ్యాట్స్ మెన్ సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొట్టారు. బ్యాట్స్ మెన్ రాణించడంతో భారత్ 466 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ముందు 368 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజు ఆటలో శార్దూల్ ఠాకూర్ (60), రిషబ్ పంత్ (50)ల ఆట హైలైట్. ఓపెనర్ రోహిత్ శర్మ(127) సెంచరీతో కదం తొక్కాడు. పుజారా 61, శార్దూల్ ఠాకూర్ 60, పంత్ 50, రాహుల్ 46, కోహ్లి 44 పరుగులతో రాణించారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకు పరిమితం చేయాలన్న ఇంగ్లండ్ ఆశలను వీరిద్దరూ వమ్ము చేశారు. వీరు ఔటైనా ఉమేశ్ యాదవ్ (25), జస్ ప్రీత్ బుమ్రా (24) కూడా బ్యాట్ కు పనిచెప్పడంతో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, రాబిన్సన్ 2, మొయిన్ అలీ 2, ఆండర్సన్ 1, రూట్ 1 వికెట్ తీశారు.
Whats App Hacking : తల్లి వాట్సప్ హ్యాక్ చేసి, ఆమె ప్రియుడ్నిబ్లాక్ మెయిల్ చేసి…
లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన 263 పరుగులే. ఆ లెక్కన ఇంగ్లండ్ కు ఈ మ్యాచ్ లో గెలవడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. 368 పరుగుల టార్గెట్ ఏ రకంగా చూసినా ఆతిథ్య జట్టుకు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఆటకు రేపు చివరి రోజు కాగా, టీమిండియా పేసర్ల దూకుడును తట్టుకుని ఇంగ్లండ్ ఏం చేస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.
Costly Cottage : నీరు లేదు, కరెంటూ లేదు.. అయినా ఈ కాటేజీ ధర రూ.5 కోట్లు, ఎందుకంత రేటు అంటే..
ఈ టెస్టులో భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 191 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 290 పరుగులు చేసి కీలకమైన 99 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే, రెండో ఇన్నింగ్స్ లో అద్భుత పోరాటపటిమ కనబర్చిన టీమిండియా ఆటగాళ్లు జట్టును పటిష్టమైన స్థితిలో నిలిపారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ (127; 256 బంతుల్లో 14×4,1×6) అద్భుతమైన శతకంతో మెరిశాడు. సిక్స్‌తో రోహిత్ సెంచరీ సాధించడం విశేషం. సుదీర్ఘ ఫార్మాట్‌లో విదేశీ గడ్డపై హిట్‌మ్యాన్‌కు ఇది తొలి శతకం కాగా.. మొత్తంగా ఎనిమిదోది.