US Mayor Elections: ట్రంప్ పార్టీకి షాక్.. జేడీ వాన్స్ తమ్ముడ్ని ఓడించిన ఇండియన్ అమెరికన్

US Mayor Elections : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి బిగ్ షాక్ తగిలింది. ఆ దేశంలో జరిగిన గవర్నర్, మేయర్ ఎన్నికల్లో

US Mayor Elections: ట్రంప్ పార్టీకి షాక్.. జేడీ వాన్స్ తమ్ముడ్ని ఓడించిన ఇండియన్ అమెరికన్

Aftab Pureval

Updated On : November 5, 2025 / 1:32 PM IST

US Mayor Elections : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి బిగ్ షాక్ తగిలింది. ఆ దేశంలో జరిగిన గవర్నర్, మేయర్ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత కీలకమైన న్యూయార్క్ సిటీతోపాటు సిన్సినాటి, అట్లాంటా, పిట్స్‌బర్గ్ ఇలా అనేక నగరాల్లో మేయర్ స్థానాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

న్యూయార్క్ నగర మేయర్ స్థానంలో భారతీయ మూలాలున్న డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహ్రాన్ మమ్దానీ విజయం సాధించగా.. భారత సంతతికి చెందిన వ్యక్తి అప్తాబ్ పురేవాల్ సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తమ్ముడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరీబౌమన్‌ను ఓడించి విజయకేతనం ఎగురవేశారు. పురేవాల్ రెండవ సారి మేయర్ గా ఎన్నికయ్యారు. తొలిసారి 2021లో మేయర్ గా ఎన్నికయ్యారు. మే నెలలో జరిగిన ఆల్ పార్టీ మున్సిపల్ ప్రైమరీలో ఆయన 80శాతం కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు. పురేవాల్

Also Read: Zohran Mamdani : ఎవరీ జోహ్రాన్ మమ్దానీ..? భారత దేశంతో అతనికున్న సంబంధాలేంటి..? 34ఏళ్లకే న్యూయార్క్ మేయర్‌గా విజయం.. ట్రంప్‌కే షాకిచ్చాడు..

అఫ్తాబ్ పురేవాల్ ఒహియోలో పంజాబీ తండ్రి, టిబెటన్ శరణార్థి తల్లికి జన్మించారు. వివాహం తరువాత పురేవాల్ తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చి ఒహియోలో స్థిరపడ్డారు. అక్కడే 1982లో ఆప్తాబ్ జన్మించారు. చిన్నప్పటి నుంచి అతను రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉండేవారు. “బిగ్, బ్రౌన్ మరియు బ్యూటిఫుల్” నినాదంతో 8వ తరగతిలో తన మొట్టమొదటి విద్యార్థి ఎన్నికల్లో గెలిచాడు. సిన్సినాటీ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి పట్టా పొందిన తరువాత.. 2008లో వాషింగ్టన్ డీసీకి వెళ్లారు. అక్కడ ఒక లా ఫర్మ్‌లో పనిచేశారు. నాలుగు సంవత్సరాల తరువాత అతను న్యాయ శాఖలో ప్రత్యేక అసిస్టెంట్ యూఎస్ అటార్నీగా పనిచేయడానికి ఒహియోలోని హోమిల్టన్ కౌంటీకి తిరిగి వచ్చారు.

2013లో ఒహియో్కు చెందిన కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం ప్రాక్టర్ అండ్ గాంబుల్‌లో లీగల్ కౌన్సిల్‌గా చేశారు. అక్కడ ఆయన ప్రముఖ స్కిన్‌కేర్ బ్రాండ్ ఓలేకు గ్లోబల్ బ్రాండ్ అటార్నీగా పనిచేశారు. మూడు సంవత్సరాల తరువాత ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసి.. రాజకీయ జీవితాన్ని అధికారికంగా ప్రారంభించారు.

2018లో పురేవాల్ ఒహియోకు చెందిన 1వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కోసం ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, రిపబ్లికన్ అభ్యర్థి స్టీవ్ చాబోట్ చేతిలో ఓడిపోయారు. 2021లో సిన్సినాటి మేయర్ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. మళ్లీ ప్రస్తుతం జరిగిన మేయర్ ఎన్నికల్లోనూ రెండోసారి గెలుపొందారు.

 

View this post on Instagram

 

A post shared by Aftab Pureval (@aftabpureval)