Video: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరుకుని డ్యాన్స్ చేసిన సునీతా విలియమ్స్

తనకు స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి వ్యోమగాములను ఆమె కలిశారు.

Video: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరుకుని డ్యాన్స్ చేసిన సునీతా విలియమ్స్

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరుకున్నారు. ఆమెతో పాటు అమెరికా వ్యోమగామి బుచ్ విల్మెర్ కూడా వెళ్లారు. వారిద్దరిని తీసుకెళ్లిన స్టారైనర్ వ్యోమనౌక గత రాత్రి స్పేస్ స్టేషన్ తో అనుసంధానమైంది. ఈ క్యాప్సుల్ ను బోయింగ్ కంపెనీ రూపొందించింది.

ఇదే దాని మొదటి మానవ సహిత యాత్రగా నిలిచింది. స్పేస్ స్టేషన్ లోకి చేరుకోగానే సునీతా విలియమ్స్ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వ్యోమగాములను తన మరో కుటుంబంగా ఆమె వర్ణించారు. తనకు స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి వ్యోమగాములను ఆమె కలిశారు.

కాగా, సునీతా విలియమ్స్, బుచ్ విల్మెర్ స్పేస్ స్టేషన్ చేరుకోకముందు హీలియం లీకేజీ వల్ల వ్యోమనౌకలోని థ్రస్టర్లలో సమస్యలు వచ్చాయి. అయినప్పటికీ అది అనుసంధానం కావడం గమనార్హం. దక్షిణ హిందూ మహాసముద్రానికి పైన 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ స్పేస్ స్టేషన్ ఉంటుంది.

Also Read: భారీగా పెరగనున్న టీవీ ఛానల్స్ సబ్‌స్ర్కిప్షన్ ధరలు.. ఇక సామాన్యుల జేబుకు చిల్లే..!