Russia-Ukraine Crisis : ఆపరేషన్ గంగ-పిల్లులతో వచ్చిన విద్యార్ధి

ఇప్పటి వరకు సుమారుగా 30 వేల మంది భారతీయులు యుక్రెయిన్ వీడినట్లు సమాచారం. వారితో పాటు రెండు పిల్లులు కూడా యుక్రెయిన్ వీడి భారత్ చేరాయి....!

Russia-Ukraine Crisis : ఆపరేషన్ గంగ-పిల్లులతో వచ్చిన విద్యార్ధి

Russia Ukraine Crisis

Updated On : March 6, 2022 / 12:01 PM IST

Russia-Ukraine Crisis : యుక్రెయిన్-రష్యా వార్‌లో  యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్ గంగ ద్వారా భారత్ కు తీసుకు వస్తోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. ఇందుకోసం మరింత ఎక్కువ మందిని  తీసుకు రావటానికి వాయుసేనకు చెందిన బాహుబలి సీ-17 విమానాలు కూడా ఉపయోగిస్తున్నారు.

ఇప్పటి వరకు సుమారుగా 30 వేల మంది భారతీయులు యుక్రెయిన్ వీడినట్లు సమాచారం. వారితో పాటు రెండు పిల్లులు కూడా యుక్రెయిన్ వీడి భారత్ చేరాయి….! అవును యుక్రెయిన్ నుంచి వచ్చిన ఒక విద్యార్ధి తనతోపాటు అక్కడ పెంచుకుంటున్న రెండు పెంపుడు పిల్లులను  కూడా భారత్ తీసుకువచ్చాడు.

Also Read :Operation Ganga : యుక్రెయిన్ నుంచి మనోళ్లు మరింత మంది వచ్చేశారు

అందుకు భారత రాయబార కార్యాలయం అధికారులు అంగీకరించటంతో వారికి ధన్యవాదాలు తెలిపాడు. పిల్లులు నా జీవితం.. నేను వాటిని   యుక్రెయిన్ లో వదిలి రాలేకపోయాను. ప్రతి ఒక్కరూ వారి వారి పెంపుడు జంతువులను తమతో తిరిగి   తీసుకు రావాలని కోరుతున్నానని ఆ విద్యార్ధి అన్నాడు.