చైనా నుంచి తీసుకొచ్చే భారతీయులను ఎక్కడ ఉంచుతారు? ఏం చేస్తారు?
చైనాలో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి రానున్నారు. వారి కోసం ఎయిర్ ఇండియా విమానం సిద్ధం చేశారు. కరోనా వైరస్(coronavirus) విభృంభణ తర్వాత చైనాలోని

చైనాలో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి రానున్నారు. వారి కోసం ఎయిర్ ఇండియా విమానం సిద్ధం చేశారు. కరోనా వైరస్(coronavirus) విభృంభణ తర్వాత చైనాలోని
చైనాలో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి రానున్నారు. వారి కోసం ఎయిర్ ఇండియా విమానం సిద్ధం చేశారు. కరోనా వైరస్(coronavirus) విభృంభణ తర్వాత చైనాలోని వూహాన్(wuhan) నగరంలో 400మంది భారతీయులు చిక్కుకున్నారు. వారందరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. బోయింగ్ 747 జంబో విమానం ముంబై నుంచి సిద్ధం చేశారు. ఆ ప్లేన్ లో ఐదుగురు డాక్టర్లు ఉంటారు. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక మెడికల్ కిట్లు ఏర్పాటు చేసింది. ముంబై నుంచి పయనం అయిన తర్వాత 6 గంటల్లో చైనాలోని వుహాన్ నగరానికి విమానం చేరుకుంటుంది. చైనాలో రెండు మూడు గంటలు విమానం ఉంటుంది. ఆ తర్వాత ఇండియాకి పయనం అవుతుంది.
కాగా వుహాన్(wuhan) నుంచి తీసుకొచ్చిన భారతీయులను(indians) ఎక్కడ ఉంచుతారు? ఏం చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రాణంతక వైరస్ వారికి సోకిందా లేదా అనేది ఎలా నిర్ధాస్తారు? అనేది ఉత్కంఠగా మారింది.
1) వుహాన్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చిన భారతీయులను 14 రోజుల పాటు ఢిల్లీ దగ్గర మనేసర్ లోని ఐసోలేషన్ సెంటర్ లో ఉంచుతారు. వారికి కరోనా వైరస్ ఉందా లేదో చెక్ చేస్తారు.
2) ప్లేన్ లో ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన ఐదుగురు డాక్టర్లు ఉన్నారు. అలాగే స్పెషల్ మెడికల్ కిట్లు కూడా ఏర్పాటు చేశారు. వీటికి కేంద్ర ఆరోగ్యశాఖ తయారు చేసింది. గ్లోవ్స్, మాస్కులు, మందులు విమానంలో ఉంచారు.
3) డాక్టర్లు నిండుగా ఉన్న కోటు వేసుకుంటారు. అందరిని టెస్ట్ చేస్తారు. ఇన్ ఫెక్షన్ లేని వారిని మాత్రమే ప్లేన్ లోకి అనుమతిస్తారు.
4) అక్కడి నుంచి వస్తున్న భారతీయులనే కాదు.. విమాన సిబ్బందిని, పైలట్లను, ఇంజినీర్లను, సెక్యూరిటీ సిబ్బందిని, డాక్టర్లని కూడా ప్రత్యేక గదుల్లో ఉంచుతారు. వారం పాటు అబ్జర్వ్ చేస్తారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకుంటారు. విమాన సిబ్బంది ప్రయాణికులకు దూరంగా ఉంటారు. ప్రయాణికులను నేరుగా తాకడం చేయరు. సీట్లలోనే నీరు, ఆహారం ఉంచుతారు.
5) కరోనా వైరస్ కారణంగా చైనాలో 200 మంది చనిపోయారు. దీంతో WHO.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
6) మన దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. వుహాన్ లోని యూనివర్సిటీ నుంచి వచ్చిన కేరళ విద్యార్థిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. త్రిసూర్ లోని ఆసుపత్రిలో ఐసోలేటేడ్ గదిలో ఉంచి పరీక్షలు చేస్తున్నారు.
7) ఉత్తర కేరళలో మరో ముగ్గురు అనుమానితులను గుర్తించారు. వారిని అబ్జర్వేషన్ లో ఉంచారు. అలాగే 800 మందికిపైగా వ్యక్తులను వారి ఇళ్లలోనే ఉంచి చెక్ చేస్తున్నారు.
8) కరోనా వైరస్ సార్స్ ను(SARS) తలపిస్తోంది. చైనా, హాంగ్ కాంగ్ లో 2002-03 మధ్య సార్స్ కారణంగా 800మంది చనిపోయారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ చేసే పనిలో సైంటిస్టులు ఉన్నారు. దీనికి మూడు నెలల సమయం పడుతుందని అంచనా వేశారు. కాగా, HIV డ్రగ్ అలువియాని(aluvia) ని ట్రీట్ మెంట్ కోసం వాడుతున్నారు.
9) ఇతర శ్వాస సంబంధ ఇన్ ఫెక్షన్ల లానే.. తొమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుంది.
10) కరోనా వైరస్ తో చైనాలోని వుహాన్ నగరంలో 204 మంది చనిపోయారు. 9వేల 692 కేసులు నమోదయ్యాయి. చైనా బయట 18 దేశాలకు వైరస్ వ్యాపించింది. చైనా బయట 100కు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే ఒక్క మరణం కూడా లేదని సమాచారం.