చిత్రవిచిత్రం.. గర్భవతి అని తెలిసిన గంటలోనే బిడ్డ ప్రసవం.. రుతుస్రావం ఆగలేదు, అసలు శృంగారమే చేయలేదు

  • Published By: naveen ,Published On : July 27, 2020 / 12:35 PM IST
చిత్రవిచిత్రం.. గర్భవతి అని తెలిసిన గంటలోనే బిడ్డ ప్రసవం.. రుతుస్రావం ఆగలేదు, అసలు శృంగారమే చేయలేదు

Updated On : September 26, 2020 / 5:10 PM IST

ఏ మహిళ అయినా గర్భం దాల్చితే ఆ విషయం వెంటనే తెలుస్తుంది. కడుపు సైజు పెరుగుతూ పోతుంది. గర్భవతి నవమాసాలు బిడ్డను కడుపులో మోస్తుంది. ఆ తర్వాతే ప్రసవం జరుగుతుంది. ఇది సృష్టి. ఇలాగే జరుగుతుంది. కానీ, ఇండోనేషియాలో చిత్రవిచిత్రం జరిగింది. ఓ మహిళ సృష్టికి విరుద్ధంగా బిడ్డను ప్రసవించింది. తాను గర్భవతి అని తెలుసుకున్న గంటలోనే పండంటి బిడ్డను ప్రసవించి ఆశ్చర్యపరిచింది.

ప్రసవానికి గంట ముందు గర్భవతి అని తెలిసింది:
ఆమె పేరు హెనీ. వయసు 30ఏళ్లు. వెస్ట్ జావాలోని తసిక్ మలాయా రీజెన్సీ ప్రాంతం మండలసరీ గ్రామ నివాసి. ఈ మహిళ ఓవర్ నైట్ లో సెన్సేషనల్ అయిపోయింది. ఆమె ఓ మగ బిడ్డను కనింది. ఇందులో విచిత్రం ఏముంది అనే సందేహం రావొచ్చు. కచ్చితంగా విచిత్రం ఉంది. ఎందుకంటే, బిడ్డను కనేందుకు గంట ముందే.. ఆమెకు గర్భవతి అని తెలిసిందట. కొన్ని నెలలుగా తనకు గర్భానికి సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదని హెనీ తెలపడం అందరిని విస్మయానికి గురి చేసింది.



అకస్మాత్తుగా కడుపు నొప్పి, ఆ తర్వాత ప్రసవం:
జులై 18 రాత్రి 8గంటల సమయంలో అకస్మాత్తుగా వాంతులు వచ్చాయని, ఉన్నట్టుండి కడుపు నొప్పి, కడుపు ఉబ్బడం మొదలైందని తెలిపింది. గంట తర్వాత గట్టిగా నొప్పులు వచ్చి బిడ్డకు జన్మనిచ్చానంది. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. గత 19 నెలలుగా ఆమె తన భర్తతో సెక్సులో కూడా పాల్గొనలేదని చెప్పింది. ‘‘ఆ రోజు రాత్రి నా పొత్తి కడుపులో కుడి వైపు ఏదో కదులుతున్నట్లు అనిపించింది. నొప్పిగా అనిపించడంతో పొరుగింటి వాళ్ల సాయంతో నాన్న ఇంటికి వెళ్లాను. అక్కడికి వెళ్లిన గంట తర్వాత బిడ్డకు జన్మనిచ్చాను’’ అని తెలిపింది.


19నెలలుగా భర్తతో సెక్స్ లో పాల్గొనలేదు, క్రమంగా రుతుస్రావం:
హెనీకి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 9 నెలలుగా ఆమెకు రుతుస్రావం క్రమం తప్పకుండా జరుగుతోంది. ఒకవేళ అది ఆగినా తాను గర్భవతి అనే విషయం ఆమెకి తెలిసేది. అలాగే, ఇద్దరు పిల్లలను కనేప్పుడు ఏర్పడిన వికారం, వాంతులు, కడుపు పెరగడం వంటి లక్షణాలు కూడా ఆమెలో కనిపించ లేదు. 19 నెలలుగా భర్తతోనూ కలవకపోవడంతో గర్భం వచ్చే అవకాశాలు కూడా లేవు. రెండో బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలతో ఆమె సెక్సుకి దూరంగా ఉంది.

ఇంకా షాక్ లోనే హెనీ, భర్త:
హెనీ విషయం తెలిసి అంతా విస్తుపోయారు. హెనీ కూడా ఇంకా షాక్ లోనే ఉంది. ఆమె భర్త, కుటుంబసభ్యులు ఇంకా తేరుకోలేదు. కాగా, మీడియా, వైద్యులు ఆమె ఇంటికి క్యూ కట్టారు. ఆమె అనుభవాన్ని తెలుసుకోడానికి ఆసక్తి చూపారు. అయితే, ప్రైవసీ నిమిత్తం హెనీ.. తనను ఎవరూ సంప్రదించవద్దని కోరుతోంది.



వైద్య ప్రపంచంలో గతంలోనూ ఇలాంటివి జరిగాయి:
ఈ ఘటనపై వైద్య నిపుణులు స్పందించారు. వైద్య చరిత్రలో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయన్నారు. చాలా అరుదుగా జరిగాయన్నారు. కొందరు మహిళలు లక్షణాలు కనిపించకుండానే గర్భం దాల్చుతారని వైద్య నిపుణులు అంటున్నారు. ఇటీవల ఓ మహిళ తాను గర్భవతి అని తెలియకుండానే బిడ్డకు ప్రసవించిందని గుర్తు చేశారు. అయితే, భర్తతో కలవకుండానే హెనీ గర్భం దాల్చడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. ఏదైతేనేం బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. బాబు బరువు 3.4 కిలోలు.



గర్భం దాల్చిన విషయం తెలియకపోవడానికి 5 కారణాలు:
బిడ్డను ప్రసవించే వరకు తాను గర్భవతిని అనే విషయం తెలియకపోవడం వైద్య ప్రపంచానికి తెలిసిన విషయమే. ఇందుకు 5 రకాల కారణాలు ఉన్నాయి. క్రిప్టిక్ ప్రెగ్నన్సీ(Cryptic Pregnancy), శిశువు యొక్క కదలికలను అనుభూతి చెందకపోవడం(Not Feeling the Baby’s Movements), రుతు చక్రాలు (Menstrual Cycles), క్రిప్టిక్ గర్భం యొక్క సమయం(Timing of Cryptic Pregnancy), ప్రసవ ప్రక్రియ యథావిధిగా ఉండటం(The Childbirth Process Remains the Same).