బీచ్‌ల్లో చెత్త ఏరుతున్న స్పైడర్ మ్యాన్ : ఎగబడుతున్నజనం

ఇండోనేషియాలోని బీచ్ లలో ఓ స్పైడర్ మ్యాన్ చెత్త (ప్లాస్టిక్ వ్యర్ధాలు) ఏరుతున్నాడు. పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నాడు. ఆ స్పైడర్ మ్యాన్ చేస్తున్న పనికి మా వంతు అంటూ ప్రజలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించటానికి స్పైటర్ మ్యాన్ ను ఫాలో అవుతున్నారు. అదేంటీ స్పైడర్ మ్యాన్ ఏంటీ..చెత్త ఏరటం ఏమిటీ జోక్ అనుకుంటున్నారా? జోక్ కాదు..అలాగని అబద్దమూ కాదు.అలాని నిజమూ కాదు..
అసలు విషయం ఏమిటంటే..ఇండోనేషియాలో ఓ కేఫ్ లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు రూడీ హార్డోనో కు ప్రకృతి అంతే ఎంతో ఇష్టం. దానికి హాని చేసే ప్లాస్టిక్ అంటే చాలా చాలా కోపం. కానీ ప్రపంచం అంతా ప్లాస్టిక్ తోనేనడుస్తోంది. దీంతో తన వంతుగా రూడీ హార్డోనో వీధుల్లోను..బీచ్ లోను పడి ఉన్న చెత్తను సేకరిస్తుంటాడు.
టూరిస్ట్ ప్లేజ్ మంచి పేరున్న ఇండోనేషియాకు ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. అలా వచ్చినవారితో పాటు స్థానికులు కూడా బీచ్ లలో ప్లాస్టిక్ వ్యర్ధాలను పడేస్తుంటారు. అలా పడేసినవాటిని ఏరుతుంటాడు హార్డోనో. అంతేకాదు ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతోందనీ..దయచేసిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని కేఫ్ కు వచ్చినవారికి పదే పదే చెబతుంటాడు. ప్లాస్టిక్ వ్యర్థాలను అలా పడేయటం వల్ల ఎంతో నష్టం జరుగుతోందని అది రాబోయే కాలంలో మనిషి మనుగడకే ప్రమాదం అని స్థానికులు చెబుతుంటాడు. దీన్ని వారు పెద్దగా పట్టించుకునేవారుకాదు.
దీంతో హార్డోనోకు ఓ ఐడియా వచ్చింది. ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణ కోసం ఓ రోల్ మోడల్ అవసరమని అనుకున్నాడు. దీంతో తన మేనల్లుడి కోసం ఎంతో ముచ్చటపడి స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టించాడు. దాన్ని చూసినప్పుడు హార్డోనోకు ఓ ఐడియా వచ్చింది. తాను కూడా ఓ స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టించుకున్నాడు.
ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ మరో పక్క ఆ డ్రెస్ వేసుకుని బీచ్ లలో ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరిస్తున్నాడు. ఈ ఫోటో అలా అలా మీడియా దృష్టికి వెళ్లింది.టీవీ షోలలో..ప్రింట్ మీడియాలు హార్డోనోను ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు. దాంతో రూడీ హార్డోనో ఫేమస్ అయిపోయాడు.
దీంతో స్థానికులు కూడా అప్పటి వరకూ హార్డోనోను లైట్ తీసుకున్నవారంతా అతనితో కలిసి ప్లాస్టిక్ సేకరిస్తున్నారు. దీంతో స్పైడర్ మ్యాన్ ఇలా రోల్ మోడల్ గా ఉపయోగపడ్డాడు అంటున్నాడు రోర్డోనో. అలాగే చెత్తను శుభ్రం చేయడానికి..సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులతో సహా వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలనీ..దానికి సంబంధించి నియమ నిబంధనలను కఠినతరం చేయాలని ఆశిస్తున్నానని హార్టోనో తెలిపారు.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నాల్గవ దేశమైన ఇండోనేషియాలో సంవత్సరానికి 3.2 మిలియన్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోతున్నాయని లెక్కలు చెబుతున్నాయి.ఇండోనేషియా, 17,000 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ద్వీపసమూహం, చైనా తరువాత ఇండోనేషియానే మహాసముద్రాలలో ప్లాస్టిక్ కాలుష్య కారకాలను వదిలే దేశంగా ఇండోనేషియా ఉంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకుంటే ముప్పు తప్పదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.