Protein Prevents Infertility : సంతానలేమి బాధితులకు గుడ్ న్యూస్..వంధ్యత్వాన్ని నివారించే ప్రొటీన్‌ ఆవిష్కరణ

సంతానలేమితో బాధపడుతున్నవారికి శాస్త్రవేత్తలు శుభవార్త అందించారు. వంధ్యత్వాన్ని నివారించే ఎఫ్‌సీ రిసెప్టర్‌ వంటి కొత్త ప్రొటీన్‌ను కనుగొన్నట్లు చెక్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ ప్రకటించింది.

Protein Prevents Infertility : సంతానలేమి బాధితులకు గుడ్ న్యూస్..వంధ్యత్వాన్ని నివారించే ప్రొటీన్‌ ఆవిష్కరణ

protein prevents infertility

Updated On : September 10, 2022 / 5:09 PM IST

protein prevents infertility : ప్రపంచంలో చాలా మంది దంపతులు సంతానం కల్గకపోవడంతో తీవ్రంగా బాధపడుతున్నారు. సంతానం కోసం గుళ్లు, గోపురాలు, ఆస్పత్రులకు తిరుగుతున్నారు. సంతాన లేమి బాధితులకు శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ తెలిపారు.

వంధ్యత్వాన్ని నివారించే ఎఫ్‌సీ రిసెప్టర్‌ వంటి కొత్త ప్రొటీన్‌ను కనుగొన్నట్లు చెక్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ ప్రకటించింది. తమ పరిశోధన ఫలితాలను సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ఇటీవలే ప్రచురించారు.

Infertility: సంతానోత్పత్తిపై వ్యాక్సిన్ ప్రభావం? ప్రభుత్వం సమాధానం!

అండంపై ఉండే ఈ ప్రొటీన్‌ శుక్రకణంలోని ప్రొటీన్‌తో బలమైన బంధాన్ని ఏర్పరచి అండం ఫలదీకరణం చెందేలా చేస్తుందని కటీనా కొమరస్కోవా తెలిపారు. ఈ పరిశోధనకు కటీనా కొమరస్కోవా నేతృత్వం వహించారు. ఈ ప్రొటీన్‌కు గ్రీకు మాతృ దేవత మయిమా అని పేరు పెట్టారు.