ట్రంప్‌ హెచ్చరించినా తగ్గని ఇరాన్‌ : ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై రాకెట్లతో దాడి

ట్రంప్‌ హెచ్చరించినా ఇరాన్‌ ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా సైనికులే లక్ష్యంగా దాడులకు దిగుతోంది.

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 03:43 AM IST
ట్రంప్‌ హెచ్చరించినా తగ్గని ఇరాన్‌ : ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై రాకెట్లతో దాడి

Updated On : January 10, 2020 / 3:43 AM IST

ట్రంప్‌ హెచ్చరించినా ఇరాన్‌ ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా సైనికులే లక్ష్యంగా దాడులకు దిగుతోంది.

ట్రంప్‌ హెచ్చరించినా ఇరాన్‌ ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా సైనికులే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. రాత్రి కూడా అమెరికా ట్రూప్స్‌ను టార్గెట్‌ చేసుకుని రాకెట్లతో దాడి చేసింది. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాల దగ్గర్లో రాకెట్లతో దాడికి దిగింది. ఉత్తర ఇరాక్‌లోని అల్‌ బాలాడ్‌లో అమెరికా ఎయిర్‌ బేస్‌ ఉంది. దీన్ని టార్గెట్‌ చేస్తూ రాకెట్లతో విరుచుకుపడింది 
ఇరాన్‌. 

ఇరాన్‌ రాకెట్‌ దాడిలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఇరాన్‌ నుంచి ఏ క్షణమైనా దాడులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించిన నేపథ్యంలో.. అమెరికా బలగాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. అల్‌ బాలాడ్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌ క్యాంప్‌.. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సాలాహుద్దీన్‌ ప్రావినెన్స్‌లో ఇరాన్‌ రాకెట్లతో దాడి చేసినట్లు అధికారులు కూడా ధృవీకరించారు. అయితే, ఈ దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.

సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇరాన్‌.. ఇరాక్‌లోని అమెరికా సైనికులే టార్గెట్‌గా దాడులకు తెగబడుతోంది. మూడు రోజుల క్రితం కూడా అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ మిస్సైల్‌తో దాడి చేసింది. ఈ దాడిలో 80 మంది అమెరికన్‌ సైనికులు హతమార్చామని ఇరాన్‌ ప్రకటించింది.

అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం మరోలా స్పందించారు. ఇరాన్‌ మిస్సైల్‌ దాడిలో ఒక్కరు కూడా గాయపడలేదని స్పష్టం చేశారు. అలాగని, ఇంకా దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమంటూ కూడా ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌ తాజా దాడుల నేపథ్యంలో అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.