ఆ దేశాలన్నింటికీ ఇరాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

అందుకు అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌కు సహకరిస్తే ఆయా దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ప్రతీకారదాడులకు దిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో అరబ్ దేశాలతో పాటు గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌పై భీకర దాడి చేయాలనుకుంటే అరబ్ దేశాల్లోని గగన, భూతలాల నుంచి ఇజ్రాయెల్ మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, డ్రోన్ల వంటివాటిని ప్రయోగించాల్సి ఉంటుంది.

అందుకు అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌కు సహకరిస్తే ఆయా దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. రహస్య దౌత్య మార్గాల ద్వారా ఇరాన్ ఈ వార్నింగ్‌ను సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ దేశాలకు ఇరాన్‌ ఇచ్చింది.

ఆయా దేశాల్లో చమురు అధికంగా లభిస్తుందన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. దీంతో ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ చెప్పింది. ఇరాన్ అణు, చమురు మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్‌ ఏ నిమిషమైన ప్రతీకార దాడులకు దిగుతుందన్న ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే అరబ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. కాగా, ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి ఆయా అరబ్ దేశాలు ఓ మెసేజ్‌ పంపినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక తెలిపింది. ఇరాన్‌పై దాడి చేయడానికి తమ మిలటరీ మౌలికసదుపాయాలు, గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతి ఇచ్చేందుకు తాము సిద్ధంగాలేమని ఆ దేశాలు చెప్పాయి.

మరోవైపు, ఇరాన్‌లో ఇవాళ పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగాయి. ఇరాన్‌ న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. అంతేకాదు, అణుస్థావరాలే టార్గెట్‌గా ఈ దాడులు జరిగాయి.

ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి?: రాహుల్ గాంధీ