Afghanistan Crisis: అమెరికా చారిత్రక తప్పిదమే అఫ్గాన్‌కు శాపమైందా?
ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో ఇప్పుడు అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. తాలిబన్ల రాజ్యం ఎలా ఉండబోతుంది..

Afghanistan Crisis
Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో ఇప్పుడు అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. తాలిబన్ల రాజ్యం ఎలా ఉండబోతుంది.. వారి పాలన విధానం ఎలా ఉండబోతుంది.. ప్రపంచ దేశాలపై తాలిబన్ల వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే.. ఆఫ్గన్ ను ఇలా సులభంగా తాలిబన్లు చేజిక్కించుకోవడంపై చాలా రకాల విశ్లేషణలు.. అభిప్రాయాలు వినిపిస్తుండగా.. అన్నీ అమెరికా తప్పిదమే తాలిబన్లకు బలంగా వినిపిస్తున్నాయి.
అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చడం లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా ప్రభుత్వం ఇరవై ఏళ్ల క్రితం ఆల్‌ఖైదాలు ఆశ్రయం కల్పించిన తాలిబన్లను మట్టుబెట్టే లక్ష్యంతో అఫ్గానిస్తాన్‌లో 2001లో సైనిక చర్యకు దిగింది. అప్పటి నుండి ఆఫ్ఘనిస్ధాన్‌ని తాలిబన్ల నుంచి కాపాడుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు అమెరికా సేనలు అఫ్గానిస్తాన్ వీడగానే తాలిబన్లు శరవేగంగా అఫ్గన్ ను కైవసం చేసుకున్నారు. ఈ తరుణంలో అమెరికా గతంలో చేసిన చారిత్రక తప్పిదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇరవై ఏళ్లలో అమెరికా ఆఫ్గన్ లో లింగ సమానత్వం.. చట్టాల పట్ల గౌరవం.. మానవ హక్కుల పరిరక్షణతో కూడిన ప్రజాస్వామ్యం పట్ల మార్పు తీసుకు రాలేకపోగా.. అఫ్గాన్‌లో అమెరికా చర్యలు నేరాల కంటే దారుణం, ఒక పెద్ద తప్పిదంగా అవతరించింది. అఫ్గన్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అమెరికా పాక్‌పైనే ఆధారపడి తాలిబన్లను ఏరివేయడమే లక్ష్యంగా పని చేసిందే తప్ప.. పాక్‌లో మూలాలు ఉన్నాయన్న సంగతి విస్మరించింది.
తమ సైన్యంపై తాలిబన్ల దాడుల్లో పాక్ ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని రుజువులు లభించినా అమెరికా ఏమీ చేయలేకపోయింది. పాక్ మిలిటరీ అకాడమీకి కూతవేటు దూరంలో దాక్కుకున్న ఒసామాబిన్ లాడెన్‌ను హతమార్చిన అమెరికా …పాక్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అఫ్గన్‌లో పరిస్థితులను మెరుగు పర్చగల సామర్థ్యం ఉన్న వారిని కాకుండా ఏ మాత్రం నాయకత్వ లక్షణాలు లేని వారిని నిలబెట్టి మరో పెద్ద పొరపాటు చేసింది. ఇలా అమెరికా చేసిన ప్రణాళికలు అఫ్గానిస్తాన్‌కు ఉపయోగపడక చివరికి అవలీలగా ఆఫ్గన్ దేశాన్ని తాలిబన్ల చేతికి చిక్కేలా చేసింది.