Israel – Hamas War Update : గాజాలో బయటపడ్డ అతిపెద్ద హమాస్ ఉగ్రవాద సొరంగం.. వీడియో వైరల్

హమాస్ దళాలను గాజా సొరంగాల్లోనే జల సమాధి చేసే వ్యూహాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళం ఇప్పటికే అమలు చేస్తోంది. ఇందులో భాగంగా సొరంగాల్లో ...

Israel – Hamas War Update : గాజాలో బయటపడ్డ అతిపెద్ద హమాస్ ఉగ్రవాద సొరంగం.. వీడియో వైరల్

Israel Defense Forces

Israel Defense Forces : గాజాలోని హమాస్ ఉగ్రవాదులతో పోరాడుతున్న ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) కాంక్రీట్, ఇనుప పట్టీలతో నిర్మించబడిన భారీ సొరంగాన్ని కనుగొంది. సరిహద్దు వద్ద ఎరెజ్ క్రాసింగ్ కు 400 మీటర్ల దూరంలో దీన్ని గుర్తించారు. గాజా నుంచి సరిహద్దు వరకు ముష్కరులను రవాణా చేయడానికి ఈ సొరంగాన్ని నిర్మించినట్లు ఇజ్రాయెల్ సైనికులు పేర్కొన్నారు. ఈ సొరంగం నిర్మాణం హమాస్ నాయకుడు యాహ్వా సిన్వార్ సోదరుడు మహ్మద్ సిన్వార్ నేతృత్వంలో జరిగినట్లు గుర్తించారు. ఈ సొరంగంకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ సైన్యం అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. పొడవాటి, లోపల విశాలమైన ఈ సొరంగంలో భారీ ఎత్తు ఆయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది.

Also Read : Israel : హమాస్ చెర నుండి విడుదలయ్యాక మొదటిసారి స్కూల్‌కి వెళ్లిన బాలిక ఎమోషనల్ వీడియో

ఈ భారీ సొరంగం నాలుగు కిలో మీటర్లు (2.5 మైళ్లు)పైగా విస్తరించి ఉంది. దీని ప్రవేశ ద్వారం ఎరెజ్ క్రాసింగ్ నుంచి 400 మీటర్లు (1,310 అడుగుల) మాత్రమే ఉందని ఇజ్రాయెల్ సైన్యం ట్విటర్ లో పేర్కొంది. ఇజ్రాయెల్ ఆసుపత్రులలో పని చేయడానికి, వైద్య చికిత్స కోసం ఇజ్రాయెల్ లోకి ప్రవేశించడానికి దీనిని రోజువారీ ప్రయాణానికి ఉపయోగించేవారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇదిలాఉంటే ఇజ్రాయెల్ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో 800 సొరంగ కారిడార్ లను కొనుగొనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వాటిలో 500కిపైగా సొరంగాలను ధ్వంసం చేశారు.

Also Read : Israel Hamas Conflict: ఇజ్రాయెల్-హమాస్ మధ్య అతిపెద్ద డీల్.. రేపే ఆగిపోనున్న యుద్ధం

హమాస్ దళాలను గాజా సొరంగాల్లోనే జల సమాధి చేసే వ్యూహాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళం ఇప్పటికే అమలు చేస్తోంది. ఇందులో భాగంగా సొరంగాల్లో సముద్రపు నీటిని విడుదల చేస్తోంది. నీరు నింపే ప్రణాళిక పూర్తి కావడానికి కొన్ని వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. సముద్రపు నీటిని సొరంగాల్లోకి పంపించడం ద్వారా హమాస్ దళాల ఆటకట్టించడంతోపాటు, సొరంగాల్లో దాచిన ఆయుధ సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేయొచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది.