Israel PM Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు శస్త్రచికిత్స

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఆదివారం పేస్‌మేకర్‌ను అమర్చేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. వివాదాస్పద న్యాయపరమైన సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరగనున్న నేపథ్యంలో నెతన్యాహు ఆపరేషన్ చేయించుకున్నారు....

Israel PM Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు శస్త్రచికిత్స

Israel PM Netanyahu

Updated On : July 23, 2023 / 1:49 PM IST

Israel PM Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఆదివారం పేస్‌మేకర్‌ను అమర్చేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. వివాదాస్పద న్యాయపరమైన సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరగనున్న నేపథ్యంలో నెతన్యాహు ఆపరేషన్ చేయించుకున్నారు. (Israel PM To Undergo Surgery To Implant Pacemaker) నెతన్యాహుకు శస్త్రచికిత్స షెబా మెడికల్ సెంటర్‌లో నిర్వహించారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

Airport flooded : జలమయం అయిన అహ్మదాబాద్ విమానాశ్రయం…వీడియోలు వైరల్

వారం క్రితం నెతన్యాహు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయ్యారు. శస్త్ర చికిత్స అనంతరం అతని పరిస్థితి బాగానే ఉందని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. పార్లమెంట్‌లో న్యాయపరమైన సమగ్ర బిల్లుపై సోమవారం ఓటింగ్ జరగనుంది. ప్రధాని కార్డియాలజీ విభాగంలో వైద్య పర్యవేక్షణలో ఉన్నారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.