Airport flooded : జలమయం అయిన అహ్మదాబాద్ విమానాశ్రయం…వీడియోలు వైరల్

గత రెండు రోజులుగా గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం మోకాలు లోతు వరద నీటితో నిండిపోయింది. గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం జలమయం అవడంతో వరదనీటిలోనే విమాన ప్రయాణికులు తిరుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి....

Airport flooded : జలమయం అయిన అహ్మదాబాద్ విమానాశ్రయం…వీడియోలు వైరల్

Ahmedabad Airport flooded

Airport flooded after heavy rain : గత రెండు రోజులుగా గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం మోకాలు లోతు వరద నీటితో నిండిపోయింది. గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం జలమయం అవడంతో వరదనీటిలోనే విమాన ప్రయాణికులు తిరుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. (Ahmedabad Airport flooded after heavy rain)

Weather Update : పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారీవర్షాలు…ఐఎండీ అలర్ట్ జారీ

కాంగ్రెస్ నాయకులతో సహా పలువురు సోషల్ మీడియా వినియోగదారులు విమానాశ్రయం వరదల్లో మునిగిపోయిందని, రన్‌వేలు, టెర్మినల్ ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయని చూపించే వీడియోలను పంచుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం టెర్మినల్ వెలుపల రోడ్డు నీటమునిగింది. భారీవర్షాలు, వరదల వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త దీపక్ ఖత్రీ అహ్మదాబాద్ విమానాశ్రయం టెర్మినల్ వెలుపల నీటిలో నిండిన రహదారి వీడియోను షేర్ చేశారు.

Delhi on high alert : యమునా నది నీటిమట్టం మళ్లీ డేంజర్ లెవెల్…ఢిల్లీలో హైఅలర్ట్

28 ఏళ్ల బీజేపీ పాలన తర్వాత గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం పరిస్థితి దుస్థితి ఇదీ. ఇదీ నరేంద్ర మోదీకి ఆదర్శవంతమైన రాష్ట్రం అని కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త దీపక్ ఖత్రీ ట్వీట్ చేశారు. మరో యూజర్ అహ్మదాబాద్ టెర్మినల్ వీడియోను షేర్ చేస్తూ ఇది అదానీ మేనేజ్డ్ ఎయిర్‌ పోర్టు అని ట్వీట్ చేశారు.

Pen Ganga : ఉధృతంగా ప్రవహిస్తోన్న పెన్ గంగా.. NH44 హైవేపై వాహనాల రాకపోకలు నిలిపివేత

గుజరాత్‌లోని దక్షిణ సౌరాష్ట్ర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. జునాగఢ్‌లో శనివారం సాయంత్రం 4 గంటల వరకు 8 గంటల్లో 219 మిల్లీమీటర్ల వర్షం కురియడంతో, పార్క్ చేసిన డజన్ల కొద్దీ కార్లు,పశువులు ప్రవహించే నీటిలో కొట్టుకుపోయాయి.