Taliban on Masood Azhar: మసూద్‌ అజర్‌ అఫ్గాన్‌లో ఉన్నాడంటూ పాక్ ప్రకటన.. స్పందించిన తాలిబన్లు

అతడు అఫ్గాన్ లో లేడని, నిజానికి పాక్ లోనే ఉన్నాడని తాలిబన్ల ప్రతినిధి జబివుల్లా ముజాహీద్ చెప్పాడు. జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ పాకిస్థాన్ కు చెందిందని అన్నాడు. పాక్ చెబుతున్న విషయాల్లో నిజం లేదని చెప్పాడు. అఫ్గాన్ విదేశాంగ శాఖ కూడా పాక్ చేసిన ప్రకటనపై స్పందించింది. ఇటువంటి ఆరోపణలు అఫ్గాన్-పాక్ మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి ప్రకటనలు చేయొద్దని చెప్పింది.

Taliban on Masood Azhar: మసూద్‌ అజర్‌ అఫ్గాన్‌లో ఉన్నాడంటూ పాక్ ప్రకటన.. స్పందించిన తాలిబన్లు

Taliban on Masood Azhar

Updated On : September 15, 2022 / 7:32 AM IST

Taliban on Masood Azhar: జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ తమ దేశంలో లేడని, పాకిస్థాన్ లోనే ఉన్నాడని అఫ్గానిస్థాన్ లోని తాలిబన్లు తెలిపారు. అఫ్గాన్ ను పాలిస్తోన్న తాలిబన్లు ఈ ప్రకటన చేయడానికి ఓ కారణం ఉంది. మసూద్‌ అజర్‌ అఫ్గాన్ లోనే ఉన్నాడని, అతడిని పట్టుకోవాలంటూ తాజాగా తాలిబన్లకు పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ లేఖ రాసింది. పాక్ లో తలదాచుకుంటున్న మసూద్ అజర్ పై చర్యలు తీసుకోలంటూ పాశ్చాత దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో పాక్ అతడు తమ దేశంలో లేడని చెబుతున్నట్లు తెలుస్తోంది.

మసూద్‌ అజర్ అఫ్గాన్ లోని నంగ్రహార్‌ ప్రావిన్స్‌ లేదంటే కునార్‌ ప్రావిన్స్‌లో ఉండొచ్చని పాక్‌ అంటోంది. దీంతో తాలిబన్లు ఘాటుగా స్పందించారు. అతడు అఫ్గాన్ లో లేడని, నిజానికి పాక్ లోనే ఉన్నాడని తాలిబన్ల ప్రతినిధి జబివుల్లా ముజాహీద్ చెప్పాడు. జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ పాకిస్థాన్ కు చెందిందని అన్నాడు.

పాక్ చెబుతున్న విషయాల్లో నిజం లేదని చెప్పాడు. అఫ్గాన్ విదేశాంగ శాఖ కూడా పాక్ చేసిన ప్రకటనపై స్పందించింది. ఇటువంటి ఆరోపణలు అఫ్గాన్-పాక్ మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి ప్రకటనలు చేయొద్దని చెప్పింది.

China Magnetic Car : చైనా మరో వండర్‌ క్రియేట్.. మాగ్నెటిక్‌ కారు తయారు