China Magnetic Car : చైనా మరో వండర్‌ క్రియేట్.. మాగ్నెటిక్‌ కారు తయారు

టెక్నాలజీతో ప్రపంచాన్నీ, ఇటు ప్రజలను పరుగులు పెట్టించడంలో అందరికంటే ముందుండే చైనా.. ఇప్పుడు అయస్కాంత శక్తితో ప్రయాణించే కారును తయారు చేసింది. దీనికి సంబంధించిన టెస్ట్‌ డ్రైవ్‌ ఇప్పటికే పూర్తయింది కూడా. ఇక ఏడాది క్రితమే మాగ్నెటిక్‌ ట్రైన్‌తో అద్భుతాన్ని ఆవిష్కరించిన చైనా.. ఇప్పుడు మరో వండర్‌ను క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది.

China Magnetic Car : చైనా మరో వండర్‌ క్రియేట్.. మాగ్నెటిక్‌ కారు తయారు

China developed magnetic car

China Magnetic Car : మనం ఇక్కడ ఎలక్ట్రిక్‌ బైకులు వాడాలో వద్దో అని తెగ ఆలోచిస్తున్నాం… మరోవైపు చైనా మాగ్నెటిక్‌ కారులను రయ్‌ రయ్‌ మనిపించేందుకు రెడీ ఐపోయింది. టెక్నాలజీతో ప్రపంచాన్నీ, ఇటు ప్రజలను పరుగులు పెట్టించడంలో అందరికంటే ముందుండే చైనా.. ఇప్పుడు అయస్కాంత శక్తితో ప్రయాణించే కారును తయారు చేసింది. దీనికి సంబంధించిన టెస్ట్‌ డ్రైవ్‌ ఇప్పటికే పూర్తయింది కూడా. ఇక ఏడాది క్రితమే మాగ్నెటిక్‌ ట్రైన్‌తో అద్భుతాన్ని ఆవిష్కరించిన చైనా.. ఇప్పుడు మరో వండర్‌ను క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది.

విద్యుత్‌ అయస్కాంత శక్తితో పనిచేసే వాహనాలను మాగ్లెవ్‌ అని పిలుస్తారు. సరికొత్త ఆవిష్కరణలకు, అద్భుతాలకు పెట్టింది పేరైనా చైనా.. గతేడాది మాగ్లెవ్‌ రైలును లాంచ్‌ చేసింది. గంటకు ఏకంగా 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే మాగ్లెవ్‌ ట్రైన్‌.. భూమ్మీద ప్రయణించే అత్యంత వేగమైన రైలు. గంటకు 600 కిలోమీటర్లకు పైగా వేగంతో ఇది ప్రయాణిస్తుంది. బుల్లెట్ రైలు కంటే వేగంగా దూసుకెళ్లగలదు..! ఇప్పుడు అదే టెక్నాలజీతో కారును చైనా సిద్ధం చేసింది.

Robot CEO: మొట్టమొదటి రోబో సీఈవోగా మిస్ టాంగ్ యూ.. నియమించిన చైనా కంపెనీ

2.8టన్నుల బరువున్న ఈ కారు.. టెస్ట్‌ డ్రైవ్‌లో గంటకు 230కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. జియాంగ్‌ ప్రావిన్స్‌ హైవేపై ఈ డ్రైవ్‌ జరిగింది. దాదాపు 8కిలోమీటర్ల మేర ఈ కారును టెస్ట్‌ చేశారు. ఈ మాగ్లెవ్‌ టెక్నాలజీతో నడిపే వాహనాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది గ్రౌండ్‌ను టచ్‌ చేయకుండా ప్రయాణిస్తాయి..! ఎందుకంటే ఇద విద్యుత్‌ అయస్కాంత శక్తి ఆధారంగా నడుస్తాయి. ఈ మాగ్లెవ్‌ కారు కూడా గ్రౌండ్‌కు 35మిల్లిమీటర్ల గ్యాప్‌తో ప్రయాణిస్తుంది. ఇక మాగ్లెవ్‌ టెక్నాలజీ వాహనాల జీవితకాలాన్ని పెంచుతాయి. పవర్‌ యూసేజ్‌ను కూడా తగ్గిస్తాయి.

అయితే ఈ టెక్నాలజీతో తయారు చేసిన వాహనాలకు సాధారణ రోడ్లపై ప్రయాణించలేవు.ఉదాహరణకు ప్రస్తుతం నడుస్తున్న మాగ్లెవ్‌ ట్రైన్లు ప్రత్యేకంగా నిర్మించిన ట్రాక్లపై మాత్రమే నడుస్తాయి. ఈ రైళ్లు ట్రాక్‌ను ఆనుకొని కాకుండా కాస్త గాల్లో తేలి ప్రయాణిస్తుంది. అత్యంత బలమైన విద్యుదయస్కాంత శక్తితో గాల్లో తేలుతూ నడుస్తుంది. మాగ్లెవ్‌ టెక్నాలజీతో రూపొందించిన కొన్ని ట్రైన్స్‌ను చైనా చాలా ఏళ్లుగా ఉపయోగిస్తోంది. ఇప్పుడు మాగ్లెవ్‌ కారుకి కూడా ఈ ఫార్ములానే పాటించాల్సి ఉంటుంది.

China Man Made Moon : చైనాలో మరో చందమామ..మొన్న‘కృత్రిమ సూర్యుడు’..ఇప్పుడు నేలపై మరో జాబిల్లి’

అయితే ఈ కార్ల నిర్వహణ అంత ఈజీ కాదు. భారీ మొత్తంలో నిధులు అవసరమవుతుంటాయి. ఈ కార్లను వినియోగంలోకి తీసుకురావాలంటే ఇప్పటికే ఉన్న రోడ్లను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్‌ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ కారుకి తగ్గట్లుగా ప్లాన్‌ మార్చాలని చైనా భావిస్తున్నట్లు సమాచారం. గతేడాది హై స్పీడ్‌ మాగ్లెవ్‌ ట్రైన్‌తో వండర్‌ క్రియేట్‌ చేసిన చైనా.. మరి ఈ కొత్త రకం కార్లతో మరెన్ని సంచలనాలకు తెరతీస్తుందోనని ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.