Robot CEO: మొట్టమొదటి రోబో సీఈవోగా మిస్ టాంగ్ యూ.. నియమించిన చైనా కంపెనీ

ఒక రోబోను సీఈవోగా నియమించుకుంది ఒక చైనా కంపెనీ. మిస్ టాంగ్ యు అనే రోబోను తమ కంపెనీ రొటేషనల్ సీఈవోగా నియమించుకున్నట్లు ‘ఫ్యుజియన్ నెట్ డ్రాగన్ వెబ్ సాఫ్ట్’ అనే చైనా కంపెనీ ప్రకటించింది.

Robot CEO: మొట్టమొదటి రోబో సీఈవోగా మిస్ టాంగ్ యూ.. నియమించిన చైనా కంపెనీ

Robot CEO: ఇప్పటివరకు రోబోలు వర్కర్లుగా, ఉద్యోగులుగా మాత్రమే సేవలందిస్తున్నాయని తెలుసు. కానీ, ఇప్పుడు ఏకంగా రోబో ఒక కంపెనీకి సీఈవోగా మారింది. చైనాకు చెందిన ఒక కంపెనీ ఈ రోబోను సీఈవోగా నియమించుకుంది.

Ram Temple In Ayodhya: అయోధ్య దేవాలయం ఖర్చు రూ.1,800 కోట్లు.. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తి

మిస్ టాంగ్ యు అనే వర్చువల్ హ్యూమనాయిడ్ రోబోను ‘ఫ్యుజియన్ నెట్ డ్రాగన్ వెబ్ సాఫ్ట్’ అనే చైనా కంపెనీ రొటేటింగ్ సీఈవోగా నియమించుకుంది. ఈ రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పని చేస్తుంది. గత నెల చివర్లోనే ఈ రోబోను సీఈవోగా నియమించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇది గేమింగ్ సంస్థ. ఒక రోబో కంపెనీ సీఈవో కావడం ఇదే మొదటిసారి. ఈ కంపెనీకి సంబంధించి స్ట్రీమ్‌లైన్ ప్రాసెస్, పనుల్ని వేగవంతం చేయడం వంటి పనుల్ని ఈ రోబో పర్యవేక్షిస్తుంది. కంపెనీకి రియల్ టైమ్ డాటా హబ్‌గా కూడా పనిచేస్తుంది. డైలీ ఆపరేషన్స్‌కు సంబంధించిన అంశాల్లోనూ నిర్ణయ తీసుకుంటుంది.

iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా!

అందరు ఉద్యోగులు మరింత సమర్ధవంతంగా, ఉత్పాదకతతో పనిచేసేలా చూస్తుంది. ఇక ఈ రోబోకు ఎప్పటికప్పుడు అల్గారిథమ్‌లో మార్పులు చేస్తూ, కొత్త టాస్కులు పూర్తి చేసేలా చేస్తారు. ఇక, రోబో సీఈవోల గురించి అలీబాబా సంస్థ ఫౌండర్ అండ్ ఛైర్మన్ జాక్ మా ఐదేళ్లక్రితమే ప్రస్తావించారు. ‘‘రాబోయే 30 ఏళ్లలో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై బెస్ట్ సీఈవోగా కచ్చితంగా ఒక రోబో పేరు ఉంటుంది’’ అని జాక్ మా అన్నారు. ఇప్పటికి బెస్ట్ సీఈవో కాకపోయినా.. రోబో ఒక సీఈవోగా మాత్రం నియామకమైంది.