Ram Temple In Ayodhya: అయోధ్య దేవాలయం ఖర్చు రూ.1,800 కోట్లు.. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తి

అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రామ దేవాలయానికి రూ.1,800 కోట్ల వ్యయం కావొచ్చని అంచనా వేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా దేవాలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.

Ram Temple In Ayodhya: అయోధ్య దేవాలయం ఖర్చు రూ.1,800 కోట్లు.. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తి

Ram Temple In Ayodhya: అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామ దేవాలయానికి రూ.1,800 కోట్లు వ్యయం కావొచ్చని అంచనా వేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. దేవాలయ నిర్మాణ పనుల్ని ఈ సంస్థే పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.

BiggBoss 6 : బిగ్‌బాస్ లో ఇదే మొదటిసారి.. మొదటివారం ఎలిమినేషన్ క్యాన్సిల్.. హమ్మయ్య అనుకున్న కంటెస్టెంట్స్..

ఫైజాబాద్ సర్క్యూట్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఈ ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ మాట్లాడారు. రామ జన్మ స్థలమైన అయోధ్యలో నిర్మించతలపెట్టిన రామ మందిర నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ట్రస్టు ఏర్పాటైంది. దేవాలయ నిర్మాణం విషయంలో పాటించాల్సిన నియమ నిబంధనలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది. ఇక్కడ వీటిపై చర్చించి, మార్పులు చేర్పుల తర్వాత ఆమోదం తెలుపుతారు. ఇక్కడ సీతారాముల వారికే కాకుండా రామాయణంతో సంబంధం ఉన్న రుషులు, ఇతర దేవుళ్లు, దేవతలు, ప్రధాన పాత్రల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు.

iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా!

దీనికోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించబోతున్నారు. మొత్తం 15 మంది సభ్యుల్లో 14 మంది సమావేశానికి హాజరైనట్లు చంపత్ రాయ్ తెలిపారు. 2023 డిసెంబర్‌కల్లా దేవాలయం నిర్మాణం పూర్తవుతుందన్నారు. గర్భాలయ ప్రతిష్టాపన 2024 మకర సంక్రాంతి వరకు అవుతుందని చెప్పారు.