Athlete Jaan Roose : రెండు టవర్ల మధ్య తాడుపై నడుస్తూ జాన్‌రూజ్ అద్భుతమైన ఫీట్.. వీడియో వైరల్

ఎస్టోనియాకు చెందిన స్లాక్ లైన్ అథ్లెట్ జాన్ రూజ్ ఇలాంటి ఫీట్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Athlete Jaan Roose : రెండు టవర్ల మధ్య తాడుపై నడుస్తూ జాన్‌రూజ్ అద్భుతమైన ఫీట్.. వీడియో వైరల్

Athlete Jaan Roose

Updated On : August 2, 2023 / 2:12 PM IST

Jaan Roose: పలుచటి గోడపై ఎలాంటి ఆధారం లేకుండా రెండు మూడు అడుగులు వేయాలంటేనే మనం భయపడుతాం.. రెండు కర్రల మధ్య తాడుపై నడిచే వారిని చూసి అమ్మో.. ఎలా నడుస్తున్నారుఇలా అని ఆశ్చర్య పోతాం. కానీ, మీరు ఈ వీడియో చూసే వణికిపోతారు. ఓ వ్యక్తి రెండు టవర్ల మధ్య 492 అడుగుల తాడుపై ఎలాంటి ఆధారం లేకుండా నడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాబోయ్.. ఇలాకూడా నడుస్తారా? అంటూ ఆశ్చర్య పోతున్నారు.

Suresh Raina : సురేష్ రైనా వ్యాయామం వీడియో చూశారా.. ఇలాచేస్తే ఫుల్ ఫిట్‌నెస్ అట.. ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్

ఎస్టోనియాకు చెందిన స్లాక్ లైన్ అథ్లెట్ జాన్ రూజ్ ఇలాంటి ఫీట్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 492 అడుగుల ఎత్తులో రెండు బిల్డింగ్‌ల మధ్య సన్నటి తాడుపై నడిచాడు. గత ఆదివారం ఖతార్‌లోని లుసైర్ మెరీనాలో ఈ ఫీట్ చేశాడు. ఈ వీడియోలో వేగంగా వీస్తున్న గాలితో అటూఇటూ వణుకుతూ తాడుపై నడుస్తుండటం చూడొచ్చు. బలమైన గాలుల మధ్య సమతుల్యతను సాధించడానికి జాన్ రూజ్ ప్రయత్నాన్ని వీడియోలో చూడొచ్చు. ఎలాంటి ఆధారం లేకుండా అతను తాడుపై నడిచాడు. ఈ ఫీట్‌తో అతను ప్రపంచంలోనే పొడవైన సింగిల్ బిల్డింగ్ స్లాక్‌లైన్‌గా రికార్డు సృష్టించాడు.

Friendship Band : ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కొంటున్నారా? ఏ రంగు దేనికి సంకేతమో తెలుసా?

జాన్ రూజ్ షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. కొందరు అతన్ని సూపర్ హీరో అని పిలుస్తుండగా.. మరికొందరు ప్రమాదాలతో పోరాడే వ్యక్తి అని పిలుస్తున్నారు. చాలా మంది దీనిని నమ్మశక్యం కానిదిగా అభివర్ణిస్తున్నారు. ఓ నెటిజన్.. ఇలా ఎందుకు చేయాలి? మీ ప్రాణాలను ఫణంగా పెట్టి ఇతరులను బాధపెట్టడం సరదా? స్వార్థపూరితంగా కనిపిస్తోంది అంటూ విమర్శిస్తూ కామెంట్ చేశాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Red Bull Qatar (@redbullqatar)

 

View this post on Instagram

 

A post shared by Red Bull Qatar (@redbullqatar)