Restaurant : ఫోన్ చూస్తూ తినొద్దు, త్వరగా తిని వెళ్లిపొవాలి : రెస్టారెంట్ యజమాని కండిషన్
ఫోన్ చూస్తూ తినొద్దు, త్వరగా తిని వెళ్లిపొవాలి ఎక్కువ సమయం వృధా చేయొద్దు అంటూ ఓ రెస్టారెంట్ యజమాని కష్టమర్లకు కండిషన్ పెట్టారు.

Tokyo restaurant Debu-chan Phone ban
restaurant : స్మార్ట్ ఫోన్ జీవితంలో భాగం కాదు ఏకంగా శరీరంలో భాగంగా మారిపోయింది. నడుస్తూ ఫోను, ప్రయాణంలోను ఫోన్లపైనే కళ్లు. పక్కవారితో మాట్లాడటమేలేదు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురి చేతుల్లోను ఫోన్లే..వాటితోనే లోకం..మంచీ చెడ్డా మాట్లాడుకోవటం లేదు. ఫోన్..ఫోన్..ఫోన్..ఇదే ప్రపంచం అయిపోయింది. ఆఖరికి తింటూ కూడా ఫోన్ పైనే దృష్టి. ఏం తింటున్నామో..ఎంత తింటున్నామో..తినేది రుచిగా ఉందా? ఆరోగ్యకరమైన ఆహారమే తింటున్నామా? తింటూ ఫోన్ చేస్తూ ఎంత సమయం వృథా చేస్తున్నాం? ఇలా దేనిపైనా దృష్టిలేదు. కేవలం ఫోన్లమీదనే ధ్యాస అంతా..
ఫ్రెండ్స్ తోనో..ఫ్యామిలీతోను రెస్టారెంట్ కు వెళ్లినా సరదాగా వారితో మాట్లాడుతూ తినటంలేదు.ఫోన్లు చూసుకుంటునే తినటం. ఈ ఫోన్ ధ్యాసలో పడి ఎంతసేపు ఉంటున్నాయో తెలియటంలేదు. అటువంటి కష్టమర్ల వల్ల రెస్టారెంట్ లో టేబుల్స్ ఫుల్ అయిపోయి..లోపలికి రావాల్సిన కష్టమర్లు వెయిట్ చేయటం..లేదా విసుగెత్తి వెళ్లిపోవటం గుర్తించిన జపాన్ లోనే ఓ రెస్టారెంట్ వినూత్న నిర్ణయం తీసుంది. ఫోన్లు చూస్తు తినొద్దు..త్వరగా తిని వెళ్లిపోవాలి అంటూ కండిషన్ పెట్టింది.
జపాన్ రాజధాని నగరం టోక్యోలో డెబు-చాన్(Tokyo restaurant Debu-chan ) అనే పేరు గల రెస్టారెంట్ కు వచ్చే కష్టమర్లు ఆహారం ఆర్డర్ చేసి..ఆర్డర్ వచ్చాక వాటిని తినకుండా ఫోన్లు చూస్తు కూర్చుంటు టైమ్ వేస్ట్ చేస్తున్న సదరు రెస్టారెంట్ ఓ వినూత్న కండిషన్ పెట్టింది. ఆహారం తింటూ ఫోన్లు చూడొద్దు..తిని వెంటనే వెళ్లిపోవాలి అంటూ కండిషన్ పెట్టింది.
ఆహారం ప్లేట్లలో వడ్డించిన తరువా అది చల్లారకుండా వేడి వేడిగా తింటనే దాని రుచి తగ్గకుండా ఉంటుంది.కానీ రెస్టారెంట్ కు వచ్చిన కష్టమర్లు ఫోన్లు చూసుకుంటూ వడ్డించి ఆహారం తినటకుండా టైమ్ వేస్టు చేస్తున్నారు. దీని వల్ల వేడి వేడిగా తినాల్సిన ఆహారాలు రుచి మారిపోతున్నాయి. నూడుల్స్,రోటీలు వంటి ఆహారంలో వేడిగా తింటేనే రుచిగా ఉంటాయి. చల్లారిపోయాక తింట రుచి మారిపోతుంది. అంటూ చెప్పుకొచ్చింది డెబు-చాన్ రెస్టారెంట్ యాజమాన్యం. దీనితో పాటు ఈ రెస్టారెంట్ ఉద్ధేశం మరొకటి కూడా ఉంది. అదే తమ రెస్టారెంట్ కు వచ్చిన కష్టమర్లు లోపల టేబుల్ ఫుల్ గా ఉండటం గమనించి బయటే వెయిట్ చేస్తున్నారు. అలా కొంతమంది వెళ్లిపోతున్నారుకూడా..ఈ విషయాన్ని గుర్తించి ఇటువంటి వినూత్న రూల్ పెట్టింది డెబు-చాన్ రెస్టారెంట్. ముఖ్యంగా బిజీ టైంలో సీటు లేక పదిమందికి పైగా బయట వేచి చూడటం సరికాదని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అందుకే తినేప్పుడు ఫోన్ వాడకంపై నిషేధం విధించామని వెల్లడించింది.