COP26 Session : కాప్ సదస్సులో నిద్రపోయిన అగ్రనేతలు!

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూసిన కాప్‌ సదస్సులో కుంభకర్ణ అవతారమెత్తారు ఆ ఇద్దరు..! హాయిగా నిద్రపోయారు..! అందరూ చూస్తున్నారని కూడా లేకుండా కునుకు తీశారు..!

COP26 Session : కాప్ సదస్సులో నిద్రపోయిన అగ్రనేతలు!

Joe

Updated On : November 3, 2021 / 12:14 PM IST

Joe Biden and Boris Johnson : అదో అంతర్జాతీయ సదస్సు..! సమస్త ప్రాణ కోటి భవిష్యత్‌ను నిర్ణయించే వేదిక..! ప్రపంచ తలరాతను మార్చేందుకు ప్రపంచదేశాధినేతలు ఒకేచోట చేరిన అద్భుత క్షణాలవి..! అపూర్వ ఘట్టమది..! అలాంటి మీటింగ్‌కు హాజరవుతున్నామంటే ఎంత సన్నద్ధమై రావాలి..? అయితే వాళ్లకు ఇవన్నీ పట్టవు..! ఎందుకంటే వాళ్లు అగ్రరాజ్య అధ్యక్షులు..! ప్రపంచాన్ని శాసిస్తోన్న లీడర్లు..! ప్రపంచంలో తామే తోపులమని ఫీల్‌ అయ్యే పెద్దన్నలు..! ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూసిన కాప్‌ సదస్సులో కుంభకర్ణ అవతారమెత్తారు ఆ ఇద్దరు..! హాయిగా నిద్రపోయారు..! అందరూ చూస్తున్నారని కూడా లేకుండా కునుకు తీశారు..!

Read More : Bennett And Modi : మోదీకి ఆఫర్..పార్టీలో చేరండి

అందులో ఒకరు ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అయితే మరోకరు సూర్యుడు అస్తమించని రాజ్యానికి అధ్యక్షుడు బోరిస్‌ జాన్సన్..! అవును ప్రపంచవేదికపై ఈ ఇద్దరు నిద్రపోయారు..! బాడీ ప్రజెంట్‌ మైండ్‌ ఆబ్సెంట్‌..! ఇది స్కూల్లో విద్యార్థులకు టీచర్లు అంటించే చురక..! ఇప్పుడు ఇదే వ్యాఖ్య బైడెన్‌, జాన్సన్‌లకు సరిగ్గా సరిపోతాయి. అప్పటివరకు అదరహో అనిపించేంతలా స్పీచ్‌లు ఇచ్చారు ఇద్దరు..! భారీ భారీ వాగ్దానాలు చేశారు..! ప్రపంచానికి తామున్నమంటూ భరోసా ఇచ్చారు..! హిస్టరీని తవ్వి మరీ ఉదాహరణలు చెప్పారు.. ఆ తర్వాత హిస్టరీ క్లాస్‌లో నిద్రపోయినట్లు హాయిగా నిద్రపోయారు.

Read More : Taliban ban foreign currency : అఫ్ఘానిస్థాన్ లో విదేశీ కరెన్సీపై నిషేధం విధించిన తాలిబన్లు

ప్రపంచాన్ని కాపాడటంలో ఫస్ట్‌ తామే ఉంటామన్నారు. ఆ తర్వాత బ్యాక్‌ బ్యాంచెర్స్‌లాగా బిహేవ్‌ చేశారు. కాలుష్యానికి తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలంటూ స్పీచ్‌ ఇచ్చిన బైడెన్‌. ఆ వెంటనే హ్యాపిగా కునుకు తీశారు. నెట్‌ జీరో సాధిస్తామన్నారు..జీరో అవర్‌లో నిద్రపోయినట్లు నిద్రపోయారు. నిదురా..నీవెంత దూరం అని అనుకున్నారో ఏమో. వేదికకు పక్కనే ఉన్న సీట్లోనే అని తెలుసుకున్నారు. నైట్‌ షిఫ్ట్‌ చేసి వచ్చిన ఎంప్లాయ్‌లా నిద్ర మత్తులో జుగారు..కునుకుపాట్లు పడ్డారు.. కూర్చున్న సీట్లోనే కుంభకర్ణుడిలా మారిపోయారు.