10TV Edu Visionary 2025: ఇది గొప్ప కార్యక్రమం.. నేను మనస్ఫూర్తిగా 10 టీవీని అభినందిస్తున్నాను: మల్లు భట్టివిక్రమార్క

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. "కాఫీ టేబుల్ బుక్‌ని విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. నిత్యం పిల్లలకు గైడ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగా దీన్ని రూపొందించారు" అని అన్నారు.

10TV Edu Visionary 2025: ఇది గొప్ప కార్యక్రమం.. నేను మనస్ఫూర్తిగా 10 టీవీని అభినందిస్తున్నాను: మల్లు భట్టివిక్రమార్క

10TV Edu Visionary 2025

Updated On : September 1, 2025 / 8:42 PM IST

10TV Edu Visionary 2025: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఇన్‌స్టిట్యూట్‌లను 10టీవీ గుర్తించింది. 10TV Edu Visionary 2025 వేదికపైకి వారిని తీసుకొచ్చింది. విద్యారంగంలో విశేషమైన సేవలందించిన వారిని 10టీవీ ఘనంగా సత్కరించింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. “కాఫీ టేబుల్ బుక్‌ని విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడుతుంది. నిత్యం పిల్లలకు గైడ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగా రూపొందించారు.

సమగ్రమైన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చి, ఓ పుస్తక రూపంగా తీసుకొనివచ్చి అందించారు. ఇది మంచి కార్యక్రమం. నేను మనస్ఫూర్తిగా 10 టీవీని అభినందిస్తున్నాను. విద్య చాలా ప్రధానమైంది. విద్యతోనే సమాజ అభివృద్ధి. రెండు తెలుగు రాష్ట్రాలు విద్యాపరంగా ప్రపంచంతో పోటీ పడుతూనే ఉన్నాయి.

ప్రభుత్వ పరంగా అనేక రకాలైన ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ప్రైవేట్ పరంగానూ విద్యా సంస్థలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకి సరిపోయేంత విద్యాబోధన అందించడానికి కావాల్సిన విధంగా విద్యా సంస్థలు, వ్యవస్థలు ఉన్నాయి. ఇవి పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఉపయోగపడ్డాయి.

ఆనాటి ప్రభుత్వాధినేతలు, పెద్దలు.. నెహ్రూ దగ్గరి నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు ఉన్న ప్రధానమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు అనేక విద్యా సంస్థలను తీసుకొచ్చారు. ఐఐటీలు కానీ ట్రిపుల్‌ఐటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకొచ్చారు. మన తెలుగువాళ్లు అనేక కార్పొరేట్ సంస్థల్లో సీఈవోలుగా పని చేసేటువంటి స్థాయికి ఎదిగారంటే ఆనాటి పాలకులు ఏర్పాటు చేసిన విద్యా వ్యవస్థలే కారణం.

ప్రభుత్వం చేసే కార్యకలాపాలతో పాటు వ్యక్తులుగా కొంత మంది ప్రైవేట్ పరంగా కూడా బయటికివచ్చి చాలా వ్యవస్థలని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవి ఏ స్థాయిలో ఉన్నాయంటే కొన్ని యూనివర్సిటీ స్థాయిలో కూడా ఎదిగాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నడుస్తున్నటు పరిశ్రమలకు పనికివచ్చే విద్యా వ్యవస్థను సిలబస్ గా మార్చి, విద్యను అందిస్తున్నాయి.

విద్యా వ్యవస్థల్లో మారుతున్న పరిశ్రమల అవసరాలకి అనుగుణంగా కూడా సిలబస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసింది. విద్యాపరంగా అనేక కార్యక్రమాలను చేపట్టింది” అని అన్నారు.