Justien Bieber: బీబర్‌కు ఏమైంది.. రూ.15కోట్లతో రెండు కోతి బొమ్మలు
కెనడా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ రూ.15కోట్లు ఖర్చు పెట్టి రెండు కోతి బొమ్మలు కొనుగోలు చేశాడు. అంత వెచ్చించి సరదా కోసం బొమ్మలు కొనుక్కున్నాడా.. పిచ్చి పని చేశాడని అనేసుకోకండి.

Justi Bieber
Justien Bieber: కెనడా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ రూ.15కోట్లు ఖర్చు పెట్టి రెండు కోతి బొమ్మలు కొనుగోలు చేశాడు. అంత వెచ్చించి సరదా కోసం బొమ్మలు కొనుక్కున్నాడా.. పిచ్చి పని చేశాడని అనేసుకోకండి. ఇది కూడా వ్యాపారమే.
ప్రస్తుతం ఎన్ఎఫ్‌టీల ట్రెండింగ్ నడుస్తోంది. ఎన్ఎఫ్‌టీలు అంటే నాన్ ఫంగిబుల్ టోకెన్స్. ఏదైనా ప్రత్యేకమైన ఫోటో, వీడియో, డాక్యుమెంట్ ఏదైనా ఎన్ఎఫ్‌టీలో వేలం వేయొచ్చు. అలా దాని క్రేజ్‌ను బట్టి.. డిమాండ్ ఉంటే వేలంలో విలువ ఎంతవరకైనా పెరగొచ్చు.
చాలామంది సెలబ్రిటీలు ఎన్ఎఫ్‌టీలపై పెట్టుబడులు పెడుతున్నారు. జస్టిన్ బీబర్ తాజాగా బోర్‌గా కూర్చొని ఉన్న కోతి(Bored Ape) ఎన్ఎఫ్‌టీని కొనుగోలు చేశాడు. 470000 డాలర్లు (రూ.3.5 కోట్లు) అన్నమాట.
Read Also : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
ఎన్ఎఫ్‌టీ కోసం ఇంత ఖర్చు పెట్టడం జస్టిన్ బీబర్ మొదటిసారి కాదు. గత వారం కూడా సుమారు రూ.10 కోట్లు పెట్టి కోతి బొమ్మను కొనుక్కున్నాడు. తాజాగా కొనుగోలు చేసిన కోతి బొమ్మతో కలిసి ఎన్ఎఫ్‌టీల కోసం ఏకంగా 15 కోట్ల రూపాయలను జస్టిన్ ఖర్చు పెట్టాడు.
జస్టిన్ బీబర్ తో పాటు పారిస్ హిల్టన్, జిమ్మీ ఫాలోన్, గ్వైనెత్ పాల్‌ట్రో లాంటి సెలబ్రిటీలు కూడా కోట్లు పెట్టి ఎన్ఎఫ్‌టీలను కొనుగోలు చేస్తున్నారు.