Kabul : బతికితే చాలు..జనాలతో నిండిపోయిన కాబుల్ ఎయిర్ పోర్టు
కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బతికితే చాలు..అని అనుకుంటున్నారు. నగరం నుంచి వెళ్లే అన్ని దారుల్ని తాలిబన్లు మూసేసారు.

Kabul Airport Thousands Are Trying To Leave With Almost No International Aid
Kabul Airport : కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బతికితే చాలు..అని అనుకుంటున్నారు. ఏ దేశమైనా వెళ్లిపోయి బతుకుదాం..అని కుటుంసభ్యులతో ఎయిర్ పోర్టుకు పరుగులు తీస్తున్నారు. లగేజీ లేకుండానే కొందరు కట్టుబట్టలతో విమానం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో కాబుల్ ఎయిర్పోర్ట్ బస్టాండ్‌ను తలపిస్తోంది. కొన్ని వందల మంది అప్ఘన్లు, విదేశీయులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ విమానం దొరికితే అది ఎక్కి వెళ్లాలని అనుకుంటున్నారు. జనాలు భారీగా రావడంతో రన్‌వే కూడా అప్ఘన్లతో నిండిపోయింది. విమానం ఎక్కేందుకు చేస్తున్న దృశ్యాలు అందరినీ కదలించి వేస్తున్నాయి. ఒకరిపై నుంచి మరొకరు తోసుకుంటూ వెళుతున్నారు.
Read More : Afghan People Fear : తాలిబన్ల అప్పటి క్రూర పాలన.. వణికిపోతున్న అఫ్ఘాన్ ప్రజలు!
నగరం నుంచి వెళ్లే అన్ని దారుల్ని తాలిబన్లు మూసేసారు. దీంతో నగరం లోపల ఉన్నవారు ఎటూ కదిలే వీలు లేకపోయింది. తాలిబన్లు ఏం చేస్తారోనన్న టెన్షన్‌తో ఇప్పుడు కాకపోతే ఇక తప్పించుకోలేమన్న ఆందోళనతో అప్ఘన్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. దేశం నుంచి వెళ్లాలంటే..ఉన్న ఏకైక మార్గం కాబుల్ ఎయిర్పోర్ట్ మాత్రమే. అక్కడికి చేరుకున్న వారిని కంట్రోల్ చేయడం ఎయిర్పోర్ట్ సిబ్బందికి కష్టంగా మారింది.
Read More :Terrorist Burhan Wani: భారత జాతీయ జెండా ఎగురవేసి..సెల్యూట్ చేసిన ఉగ్రవాది తండ్రి
ఇటు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చిక్కుకుపోయారు. వారు కూడా విమానాల కోసం ఎదురు చూస్తున్నారు. తమ దేశస్తుల్ని తరలించడానికి ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి బ్రిటన్, అమెరికా దేశాలు. బ్రిటన్ సైనికులు తమ దేశస్తుల్ని తరలిస్తున్నారు. అమెరికా సైనికులు కూడా తమ దేశస్తుల్ని క్షేమంగా అప్ఘన్ దాటిస్తున్నారు. ఎయిర్ ఇండియా కూడా ప్రత్యేక విమానాలను నడుపుతోంది.
Read More : Covid-19 : దేశంలో కొత్తగా 32,937 కరోనా కేసులు
తాలిబన్లు అప్ఘానిస్తాన్ మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఊహించినదానికంటే వేగంగా కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు. తాలిబన్ జెండాను ఎగురవేశారు. ఒక్కో ప్రావిన్స్‌ను ఆక్రమించుకుంటూ తాలిబన్లు ముందుకు దూసుకొచ్చారు. చేసేది ఏమి లేక అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. అధ్యక్ష పదవికి ఘనీ రాజీనామా చేశారు. మాజీ రక్షణ మంత్రి అలీ అహ్మద్ జలాలీని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు తాలిబన్లు. పది రోజులుగా దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ తాలిబన్లు కాబూల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం చేతులెత్తేసింది.