Terrorist Burhan Wani: భారత జాతీయ జెండా ఎగురవేసి..సెల్యూట్ చేసిన ఉగ్రవాది తండ్రి

భారతదేశానికి స్వాతంత్య్ర వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో ఓ ఉగ్రవాది తండ్రి భారత జాతీయ జెండాను ఎగురవేశారు.

Terrorist Burhan Wani: భారత జాతీయ జెండా ఎగురవేసి..సెల్యూట్ చేసిన ఉగ్రవాది తండ్రి

Terrorist Burhan Wanis Father Muzaffar Wani Hoists National Flag

Updated On : August 16, 2021 / 11:09 AM IST

Terrorist burhan wanis father Muzaffar Wani hoists national flag : భారతీయులు ఏదేశంలోఉన్నా భారత స్వాతంత్ర్య దినం వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటుంటారు. స్వాతంత్ర్యం సిద్దించి 75 సంత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉండే భారతీయులు స్వాతంత్ర్య వేడుకలను జరుపుకున్నారు. ఇక భారత్ మాటకొస్తే 75వ స్వాతంత్ర్య సంబరాలను ఆగస్టు 15న ఘనంగా జరుపుకున్నారు. కానీ ఉగ్రవాదు భారత సైనికులను పొట్టన పెట్టకున్న పుల్వామాలో ఎవ్వరూ ఊహించని ఘటన..భారతదేశం గర్వించే ఘటన జరిగింది నిన్న స్వాత్రంత్య వేడుకల్లో. ఓ ఉగ్రవాది తండ్రి పుల్వామాలో భారతదేశపు మువ్వెన్నెల జెండాను ఎగురవేశారు.భారత్ మాతాకు జై అంటూ సెల్యూట్ చేశారు ఉగ్రవాది ‘బుర్హాన్ వని’ తండ్రి ’ముజఫర్ వని’.

ఉగ్రవాద సంస్థలు భారత యువతను ఆకర్షించి దేశద్రోహులుగా మార్చేస్తున్నారు.మాతృదేహానికే ద్రోహం చేసే అరాచకాలకు పురికొల్పుతున్నారు. అలా జమ్మూకాశ్మీర్‌లో పుట్టి, పెరిగి.. ఉగ్రవాద భావ జాలానికి ఆకర్షితుడైన బుర్హాన్ వని ఉగ్రవాదిగా మారాడు. మాతృదేశానికే శత్రువుగా మారాడు. బుర్హాన్ వని ఉగ్రవాదంలోకి వెళ్లినా… అతని తండ్రి ముజఫర్ వని మాత్రం ఉగ్రవాదానికి చెక్ పెడుతూ… పుల్వామాలో 75వ స్వాతంత్ర్య వేడుకుల్లో పాల్గొన్నారు. భారత జాతీయ జెండా ఎగరేశారు. భారత్ మాతకు జై అంటూ నినదించారు.

ముజఫర్ వని త్రాల్‌లోని ప్రభుత్వ బాలిక ఉన్నత సెకండరీ స్కూల్‌లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆదివారం ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మువ్వెన్నెల జెండా ఎగరేసి వందనం చేశారు. బుర్హాన్ వని ఉగ్రవాదానికి ఆకర్షితుడై ఇంటి నుంచి పారిపోయాడు.ఆ తరువాత ప్రముఖ ఉఘ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌ సంస్థలో చేరాడు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద ట్రైనింగ్ తీసుకున్నాడు. భారత్‌ కు శత్రువుగా మారి..మాతృదేశంపై తుపాఖీ గురిపెట్టాడు. 2016 జులైలో దక్షిణ కాశ్మీర్‌లో భద్రతా దళాలపై కాల్పులు జరిపాడు. ఈక్రమంలో అలర్టైన భఆరత్ ఫోర్స్ ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ లో బుర్హాన్ వని చనిపోయాడు.దీంతో..బుర్హాన్ వని ఉగ్రవాదుల్లో చేరాడనే విషయాన్ని నమ్మని కశ్మీర్ యువతి భద్రతా దళాలు అన్యాయంగా బుర్హాన్ ను చంపేశాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..5 నెలలపాటూ ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనల్లో 100 మందికి పైగా చనిపోయారు. వేల మంది గాయపడ్డారు.

కానీ కొడుకు గురించి తెలుసుకున్న బుర్హాన్ వని తండ్రి ముజఫర్ వని మాత్రం భారత సైన్యాన్ని తప్పు పట్టలేదు. ఉగ్రవాదంలోకి వెళ్లడం తప్పే అని కొడుకు దానికి తగిన ఫలితాన్ని అనుభవించాడు అంటూ తన కొడుకునే తప్పుపట్టారు. ఉగ్రవాదాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాననీ..స్థానిక యువత దయచేసి ఉగ్రవాదం ఉచ్చులోకి దిగవద్దని కోరారు.భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత మహోత్సవాలను నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా… స్వాతంత్ర్య దినోత్సవం రోజును మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. భారతీయుల్లో దేశ భక్తిని నింపింది. అన్ని స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసుల్లో తప్పనిసరిగా జెండా వందన కార్యక్రమం జరగాలని… కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ క్రమంలో జమ్మూకాశ్మీర్ అంతటా… ఈ కార్యక్రమం కొనసాగింది.