Kabul Mosque : కాబూల్‌లో మారణహోమం.. మసీదుపై మానవబాంబు దాడి.. 66మంది మృతి

Kabul Mosque : అప్ఘానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలనే లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు దాడులకు పాల్పడుతున్నారు.

Kabul Mosque : కాబూల్‌లో మారణహోమం.. మసీదుపై మానవబాంబు దాడి.. 66మంది మృతి

Kabul Mosque Blast Kills More Than 50 At Kabul Mosque

Kabul Mosque : అప్ఘానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలనే లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు దాడులకు పాల్పడుతున్నారు. గతవారంలో మజర్ ఈ షెరీఫ్ పట్టణంలో మసీదుపై జరిగిన బాంబు దాడిని మరువకముందే మరో బాంబుదాడి జరిగింది. కాబూల్‌లోని ఖలీఫా సాహిబ్ మసీదులో మానవబాంబు తాను పేల్చుకోవడంతో 50మందికిపైగా దుర్మరణం పాలయ్యారు. మరో వందమంది వరకు తీవ్రంగా గాయపడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.

రంజాన్ మాసం చివరి శుక్రవారం కావడంతో ఖలీపా సాహిబ్‌ మసీదు రద్దీగా మారిపోయింది. ప్రార్ధనలు ముగిసిన తర్వాత ఒక్కసారిగా మసీదులో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. మసీదులో బాంబు పేలుడుకు అందులోని వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఎటు చూసినా మృతదేహాలు, క్షతగాత్రులే కనిపించారు. ఎవరో ఉగ్రవాది మానవబాంబుగా మారి మసీదులోకి చొరబడి ఉంటాడని, మానవబాంబును తనకు తాను పేల్చుకోవడంతో ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Kabul Mosque Blast Kills More Than 50 At Kabul Mosque (1)

Kabul Mosque Blast Kills More Than 50 At Kabul Mosque 

ఈ పేలుడులో 10 మంది దుర్మరణం చెందగా, మరో 20 మంది గాయపడ్డారని అప్ఘానిస్తాన్ ఇంటీరియర్‌ మినిస్టర్‌ బిస్ముల్లా హబీబ్‌ వెల్లడించారు. కాబూల్ మానవబాంబు పేలుడు ఘటనలో ఇప్పటివరకు 66 మంది మరణించగా.. 78 మంది గాయపడ్డారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ మారణహోమానికి బాధ్యత వహిస్తూ.. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. గతవారం మజర్‌ ఈ షెరీఫ్‌ నగరంలో మసీదుపై జరిగిన బాంబు దాడిలో 33 మంది మృతిచెందారు. ఈ పేలుడుకు ఇస్లామిక్‌ స్టేట్‌ తామే కారణమని ప్రకటించుకుంది.

Read Also : Kabul Bomb Blast : కాబూల్‌లో స్కూళ్లే లక్ష్యంగా బాంబు పేలుళ్లు.. భారీ సంఖ్యలో విద్యార్థులు మృతి?