కమలంలా వికసించిన కమలా హారీస్

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 07:36 AM IST
కమలంలా వికసించిన కమలా హారీస్

Updated On : November 8, 2020 / 8:06 AM IST

Kamala Harris made history :తల పైకెత్తి నోరంతా తెరిచి మనసారా నవ్వడం … ఈమె ప్రత్యేకతసంగీతం, డాన్స్ కూడా ఆమెకు చాలా ఇష్టం. కొద్ది రోజుల క్రితం ఫ్లోరిడా ప్రచారంలో ఆ విషయం బయట పడింది. జోరున కురుస్తున్న వర్షంలో హోరెత్తిన మ్యూజిక్ మధ్య కమలా డాన్స్ అమెరికన్లను ఉర్రూతలూగించింది.



సింపుల్ డ్రెస్ :-
కమలా హారీస్ డ్రెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. హిల్లరీ క్లింటన్ ధరించే తెల్ల పాంట్స్ సూట్లు, మెలానియా ట్రంప్ ధరించే ప్రత్యేకమైన హై హీల్స్ జోలికి పోరు కమలా హర్రీస్. పని చేసుకోవడానికి అడ్డురాని సింపుల్ డ్రెస్సెస్ ఆమె ఇష్టపడతారు. కాళ్లకు ఎప్పుడు స్నికర్స్ ధరిస్తారు. ఎన్నికల ప్రచారంలో కమలా ఎప్పుడు స్నికర్స్ తోనే కనిపించారు.



ఇడ్లీ సాంబార్, మసాల దోశ :-
కమలా హారీస్ ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు. అందుకే అందరూ ఆమెను బిజీ బీ అంటారు. పని ఆమె మొదటి లవ్. ఆమెకిష్టమైన రెండో అంశం భారతీయ వంటకాలు. ఇష్టంగా తినడమే కాదు, ప్రేమతో వంట కూడా చేస్తారు. మంచి సాంబారుతో ఇడ్లీ అంటే పడి చస్తానని ఆమె చాలా సార్లు చెప్పారు. మసాలా దోశ ఆమెకు ఇష్టమైన టిఫిన్‌. ఉత్తరాది వంటకాల విషయానికొస్తే టిక్కా కబాబ్స్ బాగా ఇష్టపడతారు.



కమలంలా వికాసం:-
ఎన్నికల ప్రచారం లో ట్రంప్ సహా అనేక మంది రిపబ్లికన్ పార్టీ నాయకులూ అనేక రకాలుగా కమలా హారీస్ ను ఆడిపోసుకున్నారు. ట్రంప్ ఏకంగా మోన్‌స్టర్‌ అన్నారు. కమల హారిస్ విజయం వాటన్నింటికీ జవాబు ఇచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార బురద నుంచి కమలంలా ఆమె వికసించారు.

ఇండియా ఏమి ఆశిస్తోంది :-

కమలా హారీస్ ఇప్పుడు వైస్‌ ప్రెసిడెంట్. ఇండియా ఆమె నుంచి ఏమి ఆశిస్తోంది ? ఇండియాకు కమలా హర్రీస్ ఏవిధంగా సహకారం అందించగలరు ? ఇప్పుడు ఇండియాలో ఇదే చర్చకు వస్తోంది. కమలా ఎన్నికల ప్రచారం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు జవాబు దొరకవచ్చు. ప్రచార పర్వంలో అక్కడున్న బిగ్ టెక్ కంపెనీలు ఆమెకు గట్టి మద్దతుగా నిలిచాయి. పేస్ బుక్, సేల్స్ ఫోర్స్, లింకేడిన్, వంటి టెక్ దిగ్గజాలు ఆమెకు మద్దతిచ్చాయి. కమలా నుంచి టెక్నాలజీ రంగంలో ఇండియా సహకారం ఆశించవచ్చు.