Kamala Harris: యూఎస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. బయటకు వచ్చి ఓటు వేయండి : అమెరికన్లకు హారిస్ పిలుపు

Kamala Harris : ఈరోజు ఓటింగ్ రోజు.. ప్రజలంతా బయటకు వచ్చి చురుకుగా ఓటింగ్‌లో పాల్గొనాలి.

Kamala Harris: యూఎస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. బయటకు వచ్చి ఓటు వేయండి : అమెరికన్లకు హారిస్ పిలుపు

Kamala Harris Urges Americans

Updated On : November 6, 2024 / 3:14 AM IST

Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అధ్యక్షరేసులో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పోటాపోటీగా తలపడుతున్నారు.

వైట్ హౌస్ ద్వంద్వ పోరాటం మంగళవారం క్లైమాక్స్‌కు చేరుకున్న నేపథ్యంలో డెమోకట్రిక్ అభ్యర్థి హారిస్ అమెరికా నివాసితులకు ఎన్నికల రోజున పిలుపునిచ్చారు.

ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాల్లో “బయటికి వెళ్లి ఓటు వేయాలని” కమలా హారిస్ అమెరికన్లను కోరారు. అట్లాంటా స్టేషన్ (WVEE-FM)లో ఆమె మాట్లాడుతూ.. “మేము ఇంకా పూర్తి చేయవలసి ఉంది. ఈరోజు ఓటింగ్ రోజు.. ప్రజలంతా బయటకు వచ్చి చురుకుగా ఓటింగ్‌లో పాల్గొనాలి. మీ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలి ” అని హారిస్ పేర్కొన్నారు.

Read Also : US Elections 2024 : అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు…. ఎంత సమయం పట్టినా మీ ఓటును వేయండి : ట్రంప్ పిలుపు!