ఘోర విమాన ప్రమాదం: విమానంలో వంద మంది

  • Publish Date - December 27, 2019 / 04:06 AM IST

వంద మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. కజకిస్థాన్‌లోని అల్మట్టి విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ప్రయాణిస్తున్న 100మందిలో 95మంది ప్రయాణికులు కాగా.. ఐదుగురు విమాన సిబ్బంది.

ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. కొంతమంది ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది

టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికి విమానాశ్రయానికి సమీపంలోని రెండస్తుల భవనాన్ని విమానం ఢీకొట్టిందని స్థానిక మంత్రి ఒకరు తెలిపారు.