Bangladesh New Currency Notes: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లలో కీలక మార్పులు.. ముజిబ్ చిత్రం స్థానంలో హిందూ, బౌద్ధ దేవాలయాలు..

బంగ్లాదేశ్ బ్యాంక్ మూడు వేర్వేరు డినామినేషన్లతో కూడిన నోట్లను విడుదల చేసింది.

Bangladesh New Currency Notes: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లలో కీలక మార్పులు.. ముజిబ్ చిత్రం స్థానంలో హిందూ, బౌద్ధ దేవాలయాలు..

Updated On : June 2, 2025 / 12:23 AM IST

Bangladesh New Currency Notes: బంగ్లాదేశ్ లో కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేశారు. అందులో కీలక మార్పులు చేశారు. ఇప్పటివరకు ఆ దేశ కరెన్సీ నోట్లపై ముజిబ్ బొమ్మ ఉండేది. ఇకపై అది కనిపించదు. ఆ చిత్రం స్థానంలో హిందూ, బౌద్ధ దేవాలయాల ఫొటోలు కనిపిస్తాయి.

జూన్ 1 ఆదివారం నుండి కొత్త కరెన్సీ నోట్లను బంగ్లాదేశ్ జారీ చేయడం ప్రారంభించింది. కొత్త కరెన్సీ నోట్లలో మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం లేదు. గతంలో పదవీచ్యుత ప్రధాని హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఫొటో బంగ్లాదేశ్ కరెన్సీలోని అన్ని నోట్లపై ముద్రించబడి ఉండేది. అయితే, ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తి షేక్ హసీనా పదవి పోయింది. అదే సమయంలో కొత్త నోట్లను జారీ చేయడానికి కృషి చేస్తామని బంగ్లాదేశ్ బ్యాంక్ ప్రకటించింది.

బంగ్లాదేశ్ బ్యాంక్ ప్రతినిధి ఆరిఫ్ హుస్సేన్ ఖాన్ మాట్లాడుతూ.. కొత్త కరెన్సీ నోట్లపై బంగ్లాదేశ్ సహజ ప్రకృతి దృశ్యాలు, మైలురాళ్లను ప్రదర్శించడంపై దృష్టి సారిమన్నారు. ‘కొత్త సిరీస్, డిజైన్ లో వ్యక్తుల చిత్రాలు ఉండవని, అందుకు బదులుగా సహజ ప్రకృతి దృశ్యాలు, సాంప్రదాయ మైలురాళ్లను ప్రదర్శిస్తామని” వెల్లడించారు.

Also Read: వాటే థాట్.. మైండ్ బ్లోయింగ్.. జగన్నాథుడి రథానికి రష్యా సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు..

ఓ నివేదిక ప్రకారం.. కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ దేవాలయాల చిత్రాలు, దివంగత జైనుల్ అబేదిన్ కళాకృతులు, 1971 విముక్తి యుద్ధంలో మరణించిన వారిని గౌరవించే జాతీయ అమరవీరుల స్మారక చిహ్నం ఉంటాయి. బంగ్లాదేశ్ బ్యాంక్ మూడు వేర్వేరు డినామినేషన్లతో కూడిన నోట్లను విడుదల చేసింది. కొత్త నోట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుండి, తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న దాని ఇతర కార్యాలయాల నుండి జారీ చేయబడతాయి. కొత్త డిజైన్లతో కూడిన నోట్ల డినామినేషన్లు దశలవారీగా విడుదల చేయబడతాయి” అని ఖాన్ తెలిపారు.

బంగ్లాదేశ్ తన కరెన్సీని మార్చడం ఇదే మొదటిసారి కాదు. 1972లో, పాకిస్తాన్ నుండి విముక్తి పొందిన తర్వాత ఆ దేశం తన కరెన్సీని మార్చుకుంది. ఈ నోట్లపై కొత్తగా ఏర్పడిన దేశం మ్యాప్ ఉంది. ఆ తర్వాత కొత్త డినామినేషన్లలో అవామీ లీగ్ నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఫొటో ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వంటి ఇతర పార్టీల పదవీకాలంలో కరెన్సీ నోట్లపై చారిత్రక పురావస్తు ప్రదేశాల చిత్రాలు ఉన్నాయి.