Sukhoi Jet Tyres: వాటే థాట్.. మైండ్ బ్లోయింగ్.. జగన్నాథుడి రథానికి రష్యా సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు..

సుఖోయ్ టైర్లను ఏ ప్రయోజనం కోసం అడుగుతున్నారో తెలుసుకుని తయారీదారు ఆశ్చర్యపోయారు..

Sukhoi Jet Tyres: వాటే థాట్.. మైండ్ బ్లోయింగ్.. జగన్నాథుడి రథానికి రష్యా సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు..

Updated On : June 1, 2025 / 6:53 PM IST

Sukhoi Jet Tyres: అవును.. విషయం తెలిస్తే.. మీరు కూడా వాటే థాట్.. మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. మ్యాటర్ ఏంటంటే.. జగన్నాథుడి రథానికి సుఖోయ్ యుద్ధ విమానం టైర్లను వినియోగిస్తున్నారు. అవును.. కోల్‌కతాలోని జగన్నాథుడి రథానికి 48 సంవత్సరాల తర్వాత కొత్త చక్రాలను అమర్చనున్నారు. ఇందుకోసం సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు వినియోగిస్తున్నారు. రష్యాకు చెందిన సుఖోయ్ ఫైటర్ జెట్ నుండి తయారు చేయబడిన సరికొత్త టైర్ల సెట్ ను రథానికి వాడనున్నారు. యుద్ధ విమానాలకు వాడే ఈ టైర్లు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో టేకాఫ్ అవుతాయి.

గతంలో ఆలయంలోని స్వామి వారి రథానికి బోయింగ్ విమానం టైర్లు వినియోగించే వారు. అయితే గత 15 ఏళ్లుగా వాటిని కొనుగోలు చేయడం కష్టసాధ్యంగా మారిందట. అంతేకాదు ఈ టైర్లలో సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఇస్కాన్ నిర్వాహకులు సుఖోయ్ ఫైటర్ జెట్లకు ఉపయోగించే టైర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. గత సంవత్సరం స్టీరింగ్ సమస్యలు ఎదురయ్యాయి, దాంతో రథానికి కొత్త చక్రాలను అమర్చాలని నిర్ణయం తీసుకున్నామని ఇస్కాన్ తెలిపింది.

”ఇప్పటివరకు రథానికి బోయింగ్ టైర్లు వాడాము. అయితే, వాటి కొనుగోలు కష్టంగా మారింది. అలాగే స్టీరింగ్ సమస్యలు వచ్చాయి. దాంతో కొత్త టైర్ల కోసం సుఖోయ్‌ను సంప్రదించాము. ఎందుకంటే వాటి డయామీటర్ (వ్యాసం) బోయింగ్ టైర్లకు దగ్గరగా ఉంటుంది” అని ఇస్కాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Also Read: స్విగ్గీ, జొమాటోకు పోటీగా బిగ్‌బాస్కెట్.. కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ.. ఫుల్ డిటెయిల్స్..!

ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారామన్ దాస్ మాట్లాడుతూ.. ”సుఖోయ్ యుద్ధ విమానాల కోసం టైర్లను తయారు చేసే కంపెనీకి.. కొత్త చక్రాల డిమాండ్ ఆశ్చర్యం కలిగించింది. కోట్ అడిగినప్పుడు.. సుఖోయ్ టైర్లను ఏ ప్రయోజనం కోసం అడుగుతున్నారో తెలుసుకుని తయారీదారు ఆశ్చర్యపోయారు” అని అన్నారు. ”మా అవసరాన్ని వారికి వివరించాము. తర్వాత టైర్ల తయారీదారులను రథాన్ని పరిశీలించడానికి రావాల్సిందిగా ఆహ్వానించాము. వారొచ్చి రథాన్ని చూసి వెళ్లారు. ఆ తర్వాతే మేము నాలుగు సుఖోయ్ టైర్లను పొందగలిగాము” అని రాధారామన్ దాస్ వివరించారు.

ప్రస్తుతం, సుఖోయ్ ఫైటర్ జెట్‌ల కోసం తయారు చేసిన టైర్లను జగన్నాథుడి రథానికి అమర్చుతున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉత్సవాల సమయంలో ఈ రథం చాలా నెమ్మదిగా ముందుకు సాగుతుంది. గంటకు 1.4 కి.మీ వేగంతో కదులుతుంది.