ఉత్తరకొరియాలో పోర్న్ చూస్తూ పట్టుబడ్డ బాలుడు..కిమ్ ఏం శిక్ష విధించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఉత్తరకొరియాలో ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి తెలియనివారుండడరు. ఆధునిక నియంతల్లో కిమ్ ని మించిన వారు ఎవ్వరూ లేరు. తమ దేశ పౌరులు ఏ చిన్న పొరపాటు చేసినా కిమ్ వేసే శిక్షలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Kim Jong Un Exiles North Korean Boy Caught Red Handed While Watching Porn1
Kim Jong ఉత్తరకొరియాలో ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి తెలియనివారుండడరు. ఆధునిక నియంతల్లో కిమ్ ని మించిన వారు ఎవ్వరూ లేరు. తమ దేశ పౌరులు ఏ చిన్న పొరపాటు చేసినా కిమ్ వేసే శిక్షలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో కరిపించి చంపించిన చరిత్ర కిమ్ కి ఉంది. తాజాగా మరోసారి కిమ్ క్రూరత్వం బయటపడింది. పోర్న్ వీడియోలు చూస్తూ పట్టుబడిన ఓ బాలుడికి, అతని కుటుంబానికి అత్యంత భయంకరమైన శిక్ష విధించాడు కిమ్.
ఉత్తరకొరియాలో అశ్లీలత సంబంధిత పదార్థాల ఉత్పత్తిలో ఇన్వాల్వ్ అయినా లేదా వాటిని కొన్నా లేదా అమ్మినవారికి మరణ శిక్ష వంటి కఠిన శిక్షలు విధిస్తారు. కిమ్ జోంగ్ ఉన్ ఉద్దేశంలో… పోర్న్ చూడటమంటే సమాజాన్ని నాశనం చేయడమే. ఈ నేపధ్యంలో అక్కడ పోర్న్‌పై నిషేధం విధించారు. ఇటీవల కాలంలో పోర్న్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించింది కిమ్ ప్రభుత్వం. పోర్న్ కు వ్యతిరేకంగా పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను షురూ చేశారు.
అయితే, ఇటీవల ఓ బాలుడు తన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పోర్న్ మూవీ పెట్టుకొని చూస్తున్నాడు. కానీ, ఐపీ అడ్రెస్ ని ట్రాక్ చేసి ఉత్తరకొరియా పోలీసులు అతడి ఇంటి చిరునామాను కనిపెట్టారు. బాలుడు పోర్నో చూస్తున్న సమయంలోనే అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ విషయం నియంత కిమ్ దృష్టికి వెళ్లడంతో సదరు బాలుడికి, అతని కుటుంబానికి ఆయన భయంకరమైన శిక్షను విధించాడు.
సదరు బాలుడు మరియు అతడి కుటంబసభ్యులను సమాజ బహిష్కరణ శిక్ష విధించారు. ఆ కుటుంబాన్ని దేశ సరిహద్దు ప్రాంతానికి తరిమేశారు. బాలుడిని ఉరి తీయకపోవడం అదృష్టం అని అక్కడి స్థానిక మీడియా ఓ కథనంలో పేర్కొంది. అంతేగాక ఆ బాలుడు చదివుతున్న స్కూల్ ప్రిన్సిపాల్‌కు సైతం కిమ్ శిక్ష విధించాడు. ప్రిన్సిపాల్ ను లేబర్ క్యాంప్ కు తరలించారు. ఉత్తరకొరియా చట్టాల ప్రకారం.. పాఠశాల పిల్లలు ఏదైనా తప్పుచేస్తే దానికి పాఠశాల ప్రిన్సిపాలే బాధ్యత వహించాలి.