Viral Video: ఎవరూ లేరనుకుని డాన్స్ ఇరగదీసింది: సూపర్ వైరల్ అయింది

కొరియాకు చెందిన ఒక యువతి కూడా తనలోని డాన్స్ టాలెంట్ ను బయటపెట్టి, సరదా పడింది. ఆ యువతీ చేసిన నృత్యం తాలూకు డాన్స్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అయింది

Viral Video: ఎవరూ లేరనుకుని డాన్స్ ఇరగదీసింది: సూపర్ వైరల్ అయింది

Korean Girl

Updated On : December 28, 2021 / 4:49 PM IST

Viral Video: మనలో చాలామందికి అంతర్గతంగా ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. అప్పుడప్పుడు సరదాగా పాటలు పాడడం, హాస్యాన్ని పండించడం, నృత్యాలు చేయడం వంటి దాగిఉన్న టాలెంట్ అందరిలోనూ ఉంటుంది. అయితే అలాంటి టాలెంట్ ను బయటపెట్టాలంటే.. ఎదుటివారు ఏమనుకుంటారో అనుకుంటూ సంకోచిస్తుంటాం. ఎవరూలేని ఏకాంత ప్రదేశంలో సరదా తీర్చుకుంటాం.

అలా కొరియాకు చెందిన ఒక యువతి కూడా తనలోని డాన్స్ టాలెంట్ ను బయటపెట్టి, సరదా పడింది. ఆ యువతీ చేసిన నృత్యం తాలూకు డాన్స్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అయింది. అయితే ఈవార్తలో ప్రత్యేకత ఏముందీ అనుకుంటున్నారా?. ఉంది. ఏంటంటే.. నృత్యం చేసిన యువతి ఒక కేఫ్ లో ఫ్లోర్ క్లీనర్ గా పనిచేస్తుంది. ఫ్లోర్ క్లీనర్ (గచ్చు తుడిచే మనిషి)గా పనిచేసే యువతి డాన్స్ ఇరగదీయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కొరియాలోని సియోల్ నగరంలోని ఓ కేఫ్ లో పనిచేస్తున్న ఆ యువతి, కేఫ్ ను శుభ్రం చేసేందుకు వచ్చింది. ఆ సమయంలో కేఫ్ లో ఎవరూ లేకపోవడం, మంచి బీట్ ఉన్న పాట వస్తుండడంతో.. పులకరించిపోయిన ఆ యువతి, మైమరచిపోయి డ్యాన్స్ చేసింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు, డాన్స్ చేస్తున్న యువతిని తీక్షణంగా చూశాడు. తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తున్న యువతిని డిస్టర్బ్ చేయకుండా ఆ యువకుడు కూడా చూస్తూనే మురిసిపోయాడు.

ఇంతలో ఆ యువకుడిని గమనించిన యువతి ఎంతో సిగ్గుపడిపోయి, తన పని తాను చూసుకుంది. ఈఘటన తాలూకు దృశ్యాలు కేఫ్ లోని సీసీ కెమెరాలో రికార్డు కాగా, అది చూసిన కేఫ్ నిర్వాహకులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. యువతి చేసిన ఆ నృత్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొరియా దేశస్తులు ఆ యువతికి సంబంధించిన సమాచారం కోసం ఆన్ లైన్లో తెగ వెతికిస్తున్నారంట. మరి ఆ యువతి చేసిన నృత్యం ఎలా ఉందో మీరు చూడండి.

Also Read: AP Film Tickets : సినిమా టికెట్ల రగడ, డిస్ట్రిబ్యూటర్ల ప్రతిపాదనలు ఇవే