Guinness Record: ఒక్క నిమిషంలో 352గ్రా. చికెన్ నగ్గెట్స్ లాగించి గిన్నిస్ రికార్డుకెక్కిన యువతి
యూకేకి చెందిన లియా షట్కేవర్ అనే యువతి ఒక్క నిమిషంలో 352 గ్రాముల బరువున్న 19 నగ్గెట్స్ ను తిని గిన్నిస్ రికార్డు నెలకొల్పింది

Leah
Guinness Record: చికెన్ నగ్గెట్స్ అంటే ఇష్టపడని మాంస ప్రియులు ఉండరు. మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్, కెఎఫ్‌సి వంటి ఫాస్ట్ ఫుడ్ షాపులలో దొరికే ఈ చికెన్ నగ్గెట్స్ కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి. దీంతో చిన్నారుల నుంచి పెద్దవారి వరకు మాంసప్రియులందరు ఈ నగ్గెట్స్ ను ఇష్టంగా తింటుంటారు. పకోడీ సైజులో ఉండే ఈ చికెన్ నగ్గెట్స్ ను ఒక సాధారణ వ్యక్తి ఒకేసారి 200-250 గ్రాములు తినగలరు. అటువంటిది ఒక యువతి ఒకే నిమిషంలో ఏకంగా 352గ్రాముల చికెన్ నగ్గెట్స్ లాగించేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది.
Also read:Work from Home: ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు బంపర్ ఆఫర్లు
యూకేకి చెందిన లియా షట్కేవర్ అనే యువతి ఒక్క నిమిషంలో 352 గ్రాముల బరువున్న 19 నగ్గెట్స్ ను తిని గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన నేలా జిస్సర్ అనే యువతీ 298 గ్రాముల నగ్గెట్స్‌ను కేవలం ఒకే నిమిషంలో తినేసింది. జిస్సర్ రికార్డు బద్దలు కొడుతూ లియా 352 గ్రాముల బరువు ఉన్న19 నగ్గెట్స్ ను నిముషంలో తినేసింది. లియా షట్కేవర్ గతంలోనూ మూడు నిముషాల వ్యవధిలో 775గ్రాముల చికెన్ తిని రికార్డు నెలకొల్పింది. అయితే ఇదొక్కటే కాదు గతంలోనూ ఇలా నిముషాల వ్యవధిలో తినుబండరాలు తిన్న లియా..స్థానికంగా “స్పీడ్ ఈటర్”(వేగంగా తినే యువతీ)గా పేరు తెచ్చుకుంది.