అభినందన్‌ను వెళ్లనీయండి.. గజగజ వణుకుతూ చెప్పిన పాక్ ఆర్మీ జనరల్

  • Published By: sreehari ,Published On : October 29, 2020 / 05:21 PM IST
అభినందన్‌ను వెళ్లనీయండి.. గజగజ వణుకుతూ చెప్పిన పాక్ ఆర్మీ జనరల్

Updated On : October 29, 2020 / 5:32 PM IST

Let Abhinandan Go – Army Chief Shaking :భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విషయంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా గజగజ వణికిపోయారట.. అభినందన్‌ను విడుదల చేయకపోతే భారత్ తమపై దాడిచేయ నుందని పార్టమెంటరీ నేతల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రి షా మెహ్మూద్ వెల్లడించారు. ఈ విషయాన్ని పాకిస్థానీ పార్లమెంటు సభ్యుడు ఒకరు తెలిపారు.



ఫిబ్రవరి 2019 నాటి సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తిరస్కరించారు. కానీ, ఇదే సమావేశానికి హాజరైన పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా కాళ్లు వణుకిపోయాయి. శరీరమంతా చెమటలు పట్టేసింది. పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మెహ్మూద్ ఖురేషీ అభినందన్‌ను వెళ్లనీయండి..

లేదంటే భారత్ రాత్రి 9 గంటలకు పాక్ పై దాడి చేసేందుకు సిద్ధమవుతోంది అన్నారట.. ఇదే విషయాన్ని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) నేత అయాజ్ సాదిక్ దేశ పార్లమెంటులో ప్రస్తావించారు.



ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వెంటనే కమాండర్ అభినందన్ ను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చిందని తెలిపారు.

జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. భారత్ ప్రతీకార చర్యగా పాక్‌కు చెందిన జైష్-ఎ-మోహమ్మద్ తీవ్రవాద స్థావరంపై వాయుసేనతో దాడులు చేసింది.



కశ్మీరులో పాక్ విమానం చొరబాటును అడ్డుకోవటంలో అభినందన్ అసమాన ప్రతిభ ప్రదర్శించారు.

వైమానిక పోరులో పాక్ F-16 యుద్ధవిమానాన్ని తన మిగ్-21 విమానంతో వెంటాడి కూల్చివేశారు. ఈ క్రమంలో తన విమానం కూడా కూలిపోయింది.



తప్పని పరిస్థితుల్లో పాక్ భూభాగంలో అభినందన్ దిగాల్సి వచ్చింది. దాంతో పాక్ సైన్యం వర్థమాన్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది.

ఇరుదేశాల చర్చల అనంతరం మార్చి 1, 2019న వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అభినందన్‌ను పాక్ అప్పగించింది. అభినందన్ అసమాన సాహసానికి భారత ప్రభుత్వం వీర చక్ర అవార్డుతో సత్కరించింది.