Lockdown : 10 రోజుల పాటు లాక్ డౌన్, ఇంటి నుంచి బయటకు రావొద్దు

కరోనా థర్డ్‌వేవ్‌ ఉద్ధృతి దాటికి శ్రీలంక వణికిపోతోంది. వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ నియంత్రణలోకి రాలేదు.

Lockdown : 10 రోజుల పాటు లాక్ డౌన్, ఇంటి నుంచి బయటకు రావొద్దు

Srilanka

Updated On : August 21, 2021 / 8:32 AM IST

Lockdown Srilanka : కరోనా థర్డ్‌వేవ్‌ ఉద్ధృతి దాటికి శ్రీలంక వణికిపోతోంది. వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ నియంత్రణలోకి రాలేదు. దీంతో దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లాక్‌డౌన్‌ ఆగస్టు 30 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. గతకొన్ని రోజులుగా శ్రీలంకలో నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆస్పత్రుల్లో చేరికలు పెరిగిపోయాయి.

Read More : Afghanistan : అప్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు ఆఫీసులో తాలిబన్లు

సగటున రోజుకు 4వేల కేసులు రికార్డవుతున్నాయి. అటు కొలంబోలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. జూన్‌ తర్వాత పెరిగిన ఉద్ధృతితో మరణాల సంఖ్య పెరిగింది. దీంతో మార్చురీలు, శ్మశానవాటికలు నిండిపోతున్నాయి. దీంతో దేశంలో పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని శీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ఆదేశించారు.

Read More : Asteroid : బుర్జ్ ఖలీఫా కంటే భారీ గ్రహశకలం ఈ రోజే భూమివైపు దూసుకొస్తోంది..!

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణతో ఆస్పత్రులు, మార్చురీలు, శ్మశాన వాటికలు కిటకిటలాడుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నప్పటికీ అధ్యక్షుడు గోటబాయ మాత్రం ముందుగా కఠిన చర్యలకు నిరాకరించారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు.

Read More : Pune : జరిమానా కట్టలేదని.. వాహనదారుణ్ణీ క్రేన్‌తో ఎత్తిన ట్రాఫిక్ సిబ్బంది

అయితే కరోనా ప్రభావంతో దేశంలో రోజురోజుకి ఆరోగ్య వ్యవస్థ మరింత దిగజారిపోతుందని కూటమి సభ్యులతో పాటు అక్కడ అత్యంత శక్తివంతమైన బౌద్ధ మతాధికారుల నుంచి ఆందోళన వ్యక్తం అయ్యింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో తప్పని పరిస్థితుల్లో శ్రీలంక అధ్యక్షుడు లాక్‌డౌన్‌కు మొగ్గుచూపినట్లుగా తెలుస్తోంది.