Madagascar Minister: సముద్రంలో 12గంటల పాటు ఈది బయటపడ్డ మంత్రి
తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో కుప్పకూలినా మొండి ధైర్యంతో 12గంటల పాటు పోరాడి సముద్రంలో ఈదుకుంటూ బయటపడ్డారు మంత్రి.

Madagascar
Madagascar Minister: తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో కుప్పకూలినా మొండి ధైర్యంతో 12గంటల పాటు పోరాడి సముద్రంలో ఈదుకుంటూ బయటపడ్డారు మంత్రి. దక్షిణాఫ్రికాలో మడగస్కన్ మంత్రి సెర్జ్ గెల్లె ‘నేను చనిపోయే క్షణం ఇంకా రాలేద’ని చెప్తున్నారు. సోమవారం ఐలాండ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో దాదాపు 39మంది చనిపోగా మంత్రితో పాటు మరికొందరు పోలీసులు మాత్రమే సేఫ్ అయ్యారు. పోలీస్ చీఫ్ జఫీసంబత్రా రావోవీ మాట్లాడుతూ.. మంత్రిగా దేశానికి సేవలందిస్తున్న సెర్జె గెల్లె.. 57ఏళ్ల వయస్సులోనూ 30ఏళ్ల వ్యక్తిలా ఉంటారు.
స్పోర్ట్స్ లో గ్రేట్ స్టామినాతో ఉండే ఆయన ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారుని కొనియాడారు రావోవీ. మంత్రిని అనుసరిస్తూ చాపర్ లో వస్తున్న రావోవీ సైతం సమయానికి బయటపడి ప్రాణాలు కాపాడుకోగలిగారు.