యుఎస్ మొట్టమొదటి బ్లాక్ మహిళా ఫైటర్ పైలట్ గా చరిత్ర సష్టించిన ‘మాడెలిన్ స్వెగల్’
ఆకాశవీధిలో మహిళామణుల గెలపు సంతకాలకు కొదవలేదు. పైలెట్లుగా రాణిస్తున్న మహిళలు అరుదైన గౌరవాలను అందుపుచ్చుకున్నారు. ఒకప్పుడు వంటి ఇంటికే పరిమితమైన అతివలు తమ ప్రతిభాపాటవాలతో ఆకాశంలో కూడా తమదైన ముద్ర వేసుకుంటున్నారు.
అటువంటి మరో అరుదైన వీరనారి యూఎస్ యుఎస్ మొట్టమొదటి బ్లాక్ మహిళా ఫైటర్ పైలట్ మాడెలిన్ స్వెగల్ చరిత్ర సృష్టించారు. మాడలిన్ స్వెగల్ టాక్టికల్ ఎయిర్ ఏవియేటర్ ట్రైనింగ్ సిలబస్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. 2020 జులై నెల చివరిలో యూఎస్ నేవీ పైలెట్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
దీనికి సంబంధించి యూఎస్ నావెల్ ఎయిర్ ట్రైనింగ్ సంస్థ ట్వీట్ చేసింది. స్వెగల్ ను ‘BZ’ అని ప్రశంసిస్తూ కోట్ చేసింది. ‘BZ’ అంటే బ్రావో జూలు అని అర్థం.దీన్ని నావెల్ భాషలో వెల్ డన్ అని సంభోధిస్తారు. “స్వెగల్ @ USNavy యొక్క మొట్టమొదటి బ్లాక్ ఫిమేల్ TACAIR పైలట్ అని ఈ నెలాఖరులో ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్ ’ అందుకుంటుందని నావెల్ ఎయిర్ ట్రైనింగ్ సంస్థ చీఫ్ ప్రశంసలు కురిపించారు.ఈ ఘనత సాధించిన మాడలిన్ ఎంతోమందితో ప్రశంసలు అందుకుంటున్నారు మాడెలిన్ స్వెగల్.
