ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువ‌తిగా మలాలా

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూస‌ఫ్‌ జాయ్‌ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువ‌తిగా గుర్తింపు పొందింది.

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 02:52 AM IST
ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువ‌తిగా  మలాలా

Updated On : December 27, 2019 / 2:52 AM IST

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూస‌ఫ్‌ జాయ్‌ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువ‌తిగా గుర్తింపు పొందింది.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూస‌ఫ్‌ జాయ్‌ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువ‌తిగా గుర్తింపు పొందింది. 21వ శ‌తాబ్ధపు రెండ‌వ ద‌శ‌కంలో ఫేమ‌స్ టీనేజ‌ర్‌గా మ‌లాలా నిలిచినట్లు.. ఐక్యరాజ్యస‌మితి ప్రకటించింది. 2010 నుంచి 2019 మ‌ధ్య కాలంలో మ‌లాలాకు వ‌చ్చిన గుర్తింపు ఆధారంగా యూఎన్ ఈ విష‌యాన్ని వెల్లడించింది. 

ఈ మేరకు యూఎన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌లోని బాలిక‌ల విద్య కోసం మ‌లాలా చేసిన పోరాటాన్ని యూఎన్‌ గుర్తుచేసింది. యుక్త వ‌య‌సు నుంచే మ‌లాలా బాలిక విద్య గురించి మాట్లాడింద‌ని, తాలిబ‌న్ల అకృత్యాలపై పోరాడింద‌ని త‌న రిపోర్ట్‌లో పేర్కొంది. ఆమె సేవకు గుర్తింపుగా 2014లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. 2017లో యూఎస్ శాంతిదూతగా కూడా మలాల నిలిచారు. 

అత్యంత చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా పాకిస్తాన్‌ బాలిక మలాలా యూసఫ్‌జాయ్ చరిత్ర సృష్టించింది. భారత్ కు చెందిన వ్యక్తి కైలాశ్ సత్యార్థితో పాటు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. అప్పట్లో మలాలపై జరిగిన హత్యాయత్నం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలను రేపింది. ఈ అమానవీయ ఘటనపై నిరసనలు చెలరేగాయి. 2012లో మానవ హక్కుల రోజు సందర్భంగా యునెస్కో మలాలాకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. 

ప్రతి బాలిక బడికి వెళ్లటం హక్కుగా రూపొందడానికి, బాలికలకు చదువు అత్యవసర అంశంగా మరడానికి మలాల చేసిన కృషి ప్రశంసనీయం అని తెలిపిందని ఐక్యరాజ్యసమితి తమ నివేదికలో పేర్కొంది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు వారు మలాలాను తీవ్రంగా గాయపరిచిన విషయం తెల్సిందే. డాక్టర్లు ఏడు గంటల పాటు శ్రమించి ఆమె వెన్నెముకలో ఉన్న బుల్లెట్‌ను తొలగించారు. 

మలాలా యూసఫ్ జాయ్ జీవిత చరిత్ర ఐయామ్ మలాల అనే పుస్తకం పేరిట రూపంలో వచ్చింది. తెలుగులో కూడా నేను మలాల అనే పేరుతో అనువాదమైంది. తాలిబన్ల దాడిలో గాయపడిన మలాల యూసఫ్ జాయ్ తన జ్ఞాపకాలను పుస్తక రూపంలోకి తీసుకువచ్చింది.