జింక సింగిల్.. ఐదు చిరుతలకు చుక్కలు చూపించింది..జింతాత చీతా చీతా..జింతాతత చేసేసింది..!!

సాధు జంతువు జింక చిరుత పులులకు చుక్కలు చూపించింది. జింకను వేటాడదామనుకున్న చిరుత పులుల గుంపును డిష్యూం..డిష్యూం అంటూ తన్ని పడేసింది. అలా ఒకటీ ఒక్కటి కాదు రెండు కాదు… ఐదు చిరుత పులులు జింకమీద దాడి చేశాయి. కానీ జింక మాత్రం ఒక్కటే.
సాధారంగా చిరుతపులి జింకపై దాడి చేస్తే జింక ప్రాణాలపై ఆశ వదిలేసుకోవాల్సిందే. అటువంటిది ఏకంగా ఐదు చిరుతలు దాడిచేస్తే ఆ జింక పరిస్థితి ఏంటీ..ఇంకేముంది దాని పని అంతే పులులకు ఆహారమైపోవాల్సిందేనని అనుకుంటాం. కానీ అప్పుడే జరిగిందో అద్భుతం..జింక ఐదు చిరుత పులులపై ఎటాక్ చేసింది. కాళ్లతో తన్ని పడేసింది.
ఈ జింక కాస్త తెలివైనది లాగుంది. టైమ్ కోసం వేచి చూసింది. చిరుత పులుల ఫ్యామిలీ మొత్తంపై తన ప్రతాపాన్ని చూపెట్టింది…ఛాన్స్ కోసం వెయిట్ చేసింది. వెనక్కాళ్లతో డిష్యూం డిష్యూం అంటూ ఒక్కోదానికి జింతాత చితాచితా చేసి… రయ్యిమంటూ అక్కడ నుంచి పరుగులు తీసింది. దీంతో ఆ చిరుతలు వెర్రిమొఖాలు వేసుకుని జింక పరుగెత్తినవైపు చూస్తుండిపోయాయి. కెన్యాలోని సలాయ్‌షో పార్కులో జరిగిన ఈ సన్నివేశాల్ని బ్రిటన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ కెవిన్ క్లిక్ మనిపించారు.
Read More>>శ్రీనివాస్ గౌడ నాచ్చురల్ సిక్స్ పాక్.. సీక్రెట్ ఇదే!