చేపపై కూర్చుంటే అందులో ఇరుక్కుపోయింది

చైనాలో ఓ ముప్పై ఏళ్ల వ్యక్తికి వింత సమస్య వచ్చింది. యాక్సిడెంటల్‌గా చేపమీద కూర్చుంటే అది లోపల ఇరుక్కుపోయింది. నీలి రంగు తిలాపియా చేపను అతని రెక్టమ్ లో నుంచి సర్జరీ చేసి తొలగించారు. డాక్టర్లు చేప సైజ్ క్లియర్ గా చెప్పకపోయినప్పటికీ అది 30-40 సెంటిమీటర్ల పొడవు(12-16 అంగుళాలు) ఉండొచ్చని అంచనా.
సదరన్ చైనాలో గువాంగ్‌డాంగ్ ప్రాంతంలోని జావోకింగ్ హాస్పిటల్ లో ఈ కేసు నమోదైంది. కడుపులో నొప్పి అంటూ వచ్చిన వ్యక్తికి ఎక్స్ రే నిర్వహించిన డాక్టర్లు షాక్ అయ్యారు. ఓ సారి కూర్చొన్నప్పుడు యాక్సిడెంటల్‌గా ఏదో లోపలికి వెళ్లినట్లు అనిపించిందని డాక్టర్లకు చెప్పాడు.
తనకు తానుగా తీసుకోవడానికి ప్రయత్నించి ఫెయిలవడంతో హాస్పిటల్ కు వచ్చాడు. వైద్యులు అతని పొట్ట భాగంలో సర్జరీ చేసి చనిపోయిన చేపను బయటకు తీశారు. ఎందుకంటే అది పెద్ద సైజులో ఉంది. చాలా కంపుకొడుతుందని తీసిన వీడియోలో నర్సు మాటల్లో వినిపిస్తుంది.