Eel Fish Anus : వీడెవడండీ బాబూ.. మలద్వారంలోకి చేపను పంపి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లను సంప్రదిస్తే మందులు ఇస్తారు. అయితే చైనాకి చెందిన ఓ వ్యక్తి మలబద్ధకం నుంచి రిలీఫ్ కోసం పిచ్చి పని చేశాడు. సుమారు 20 సెంటీమీటర్ల పొడవు గల ఓ ఈల్ చేపను తన మలద్వారంలోకి..

Eel Fish Anus : వీడెవడండీ బాబూ.. మలద్వారంలోకి చేపను పంపి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

Eel Fish Anus

Updated On : July 29, 2021 / 8:16 PM IST

Eel Fish Anus : మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లను సంప్రదిస్తే మందులు ఇస్తారు. సమస్య పరిష్కారం అవుతుంది. అయితే చైనాకి చెందిన ఓ వ్యక్తి మలబద్ధకం నుంచి రిలీఫ్ కోసం పిచ్చి పని చేశాడు. సుమారు 20 సెంటీమీటర్ల పొడవు గల ఓ ఈల్ చేపను తన మలద్వారంలోకి జొప్పించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు.

చైనాలోని జింగ్హువాలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి చాలా రోజులుగా మలబద్ధకంతో బాధ పడుతున్నాడు. తన సమస్యను నివారించాలని అతడు బాగా ప్రాచుర్యం పొందిన ఒక ‘ఫోక్ రెమిడీ’ ని ఆశ్రయించాడు. మలాశయంలోకి ఈల్ చేపను పంపిస్తే మలవిసర్జన సుఖంగా జరుగుతుందని గుడ్డిగా నమ్మేశాడు. 20 సెంటీమీటర్ల చేపను మలద్వారంలో పెట్టుకున్నాడు. ఇక తన సమస్య పరిష్కారం అయినట్టే అని కలలు కన్నాడు.

కట్ చేస్తే.. ఆ చేప మలాశయంలోకి వెళ్లి.. అక్కడ రంధ్రం చేసి పొత్తికడుపులోకి ప్రవేశించింది. అతి సున్నితమైన పెద్ద పేగుకి రంధ్రం కావడంతో తీవ్రమైన రక్తస్రావం అయ్యింది. ఆ నొప్పి భరించలేక అతడు నరకం అనుభవించాడు. ఆసుపత్రికి వెళ్తే పరువు పోతుందని, తీవ్రమైన నొప్పిని కూడా భరించాడు. కానీ ఆ నొప్పి మరింత పెరగడంతో ఇక తట్టుకోలేక ఆసుపత్రికి వెళ్లాడు. అతికష్టం మీద డాక్టర్లు ఆపరేషన్ చేసి అతడిని బతికించారు. కొంచెం ఆలస్యమైనా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని చెప్పారు. సొంత వైద్య చికిత్సా విధానం అతడి ప్రాణం మీదకు తెచ్చింది. ఇలాంటి చికిత్సలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.