హోటల్ రూంలో జెర్రీ ఉంది…టామ్ ని పంపించాలని రిసెప్షన్ కు ఫోన్

  • Published By: venkaiahnaidu ,Published On : January 19, 2020 / 12:01 PM IST
హోటల్ రూంలో జెర్రీ ఉంది…టామ్ ని పంపించాలని రిసెప్షన్ కు ఫోన్

Updated On : January 19, 2020 / 12:01 PM IST

ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే భాషలలో ఒకటి అయినప్పటికీ, కొంతమంది విదేశాలకు వెళ్లినప్పుడు ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయడం అంత సులభం కాదని భావిస్తారు. ఒక అరబ్ మనిషి తన హోటల్ గది లోపల ఎలుక గురించి హోటల్ సిబ్బందికి తెలియజేసిన విధానం దీనికి ఉదాహరణ. తన సమస్యను హోటల్ సిబ్బందికి తెలియజేడానికి ఓ అరబ్ వ్యక్తి పడిన పాట్లు చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఓ క్లిప్ ను ఓ నెటిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా..ఇప్పుడు ఇది తెగ వైరల్ అవుతుంది.

నెటిజన్ షేర్ చేసిన ఆ క్లిప్ లో…యూకేలోని హోటల్ ఇంటర్ కాంటినెంటల్ లోని ఓ గదిలో ఉన్న అరబ్ వ్యక్తి…తన రూంలో ఎలుక ఉందని తెలియజేసేందుకు హోటల్ రిసెప్షన్ కు ఫోన్ చేశాడు. తను ఇంగ్లీష్ బాగా వీక్ అని అంగీకరించిన అతడు పాపులర్ కార్టూన్ టామ్ అండ్ జెర్రీని ఉదాహరణగా తీసుకొని తన సమస్యను తెలియజేశాడు.

తన రూమ్ లో “జెర్రీ” ఉందని ఆ అరబ్ వ్యక్తి ఫోన్ లో చెప్పాడు. అయితే అంతటితో ఆగని ఆ వ్యక్తి రిసెప్షన్ నుంచి జెర్రీని పట్టుకునేందుకు వెంటనే టామ్ ను పంపించాలని కోరాడు. జనవరి-17,2020న ట్విట్టర్ లో ఓ నెటిజన్ ఈ క్లిప్ ను పోస్ట్ చేయగా కోటికి పైగా వ్యూస్ తో ఇది వైరల్ గా మారింది. అరబ్ వ్యక్తి తన సమస్యను ఫన్నీ,క్రియేటివ్ విధానంలో తెలియజేసిన విధానం నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తోంది. టామ్ అండ్ జెర్రీ కార్టూన్లతో కూడిన టన్నుల కొద్దీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.