China : మాజీ ప్రియురాలు తిరిగి రావాలని.. వర్షంలో మోకాళ్లపై 21 గంటలు నిలబడి వేడుకున్న వ్యక్తి
అతను వర్షం, చలితో పోరాడుతూ ఆమె కార్యాలయం బయట మోకరిల్లి చేతిలో గులాబీల గుత్తితో తన మాజీ ప్రియురాలు మనసు మార్చుకునే వరకు వేచి ఉన్నాడు. ఇంతలో స్థానికులు అతని చుట్టూ గుమిగూడి ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు.

China
China : విడిపోవడం అనేది తీవ్రమైన, బాధాకరమైన అనుభవం. విడిపోయిన ఇద్దరికీ తీవ్ర నొప్పి, బాధను కలిగిస్తుంది. మీరు ఇష్టపడే వ్యక్తిని విడిచిపెట్టడం కూడా చాలా కష్టం. చైనాలోని ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలికి వదలుకోవండం ఇష్టం లేక ఆమెను తిరిగి పొందడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. మాజీ ప్రియురాలు తిరిగి రావాలని ఓ వ్యక్తి వర్షంలో మోకాళ్లపై 21 గంటలు నిలబడి వేడుకున్నాడు. ఈ సంఘటన సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు చైనాలోని సోషల్ మీడియాలో సంచలనం కలిగించాయి.
ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలి కోసం ఆమె కార్యాలయం బయట వర్షంలో మోకాళ్లపై 21 గంటలు నిలబడి తిరిగి రావాలని వేడుకున్నాడు. అతను మార్చి 28 మధ్యాహ్నం 1 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు 21 గంటల పాటు దాజౌలోని భవనం ప్రవేశ ద్వారం బయట మోకరిల్లాడు. అతను వర్షం, చలితో పోరాడుతూ ఆమె కార్యాలయం బయట మోకరిల్లి చేతిలో గులాబీల గుత్తితో తన మాజీ ప్రియురాలు మనసు మార్చుకునే వరకు వేచి ఉన్నాడు. ఇంతలో స్థానికులు అతని చుట్టూ గుమిగూడి ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు.
Boyfriend : ప్రేమకోసం సరిహద్దు దాటాడు.. ప్రేయసితో తిరిగి వచ్చాడు.
తాము అతడి ప్రయత్నాన్ని విడిచిపెట్టమని చెప్పడానికి ప్రయత్నించామని లి అనే వ్యక్తి చెప్పారు. మోకరిల్లి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. స్నేహితురాలు కనిపించడానికి ఇష్ట పడలేడటం లేదని కానీ, మీరు ఇప్పటికీ ఇక్కడే ఉన్నారని తెలిపారు. ఇంత హంగామా చేసినా అతడి మాజీ ప్రియురాలు కనిపించలేదు. ఈ విచిత్రమైన పరిస్థితి అందరినీ ఎంతగానో ఆకర్షించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని ప్రయత్నాన్ని విరమింపచేయడానికి ప్రయత్నించారు.
అయినా అతను పట్టువదలుకండా మోకాళ్లపైనే నిల్చున్నాడు. తాను ఇక్కడ మోకరిల్లడం చట్ట విరుద్ధమా? అని పోలీసులను ప్రశ్నించారు. అయితే, నేరం కాకపోతే తనను వదిలేయాలని అడిగాడు. కొన్ని రోజుల క్రితం తన మాజీ ప్రియురాలు విడిపోయిందని, అతను ఆమెను క్షమాపణలు కోరుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. చలిని భరించలేక చివరికి అతను మార్చి 29 ఉదయం 10 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.