Montana : మనవడిని క్రూరంగా హింసించిన తాత.. 100 ఏళ్ల జైలు

వెస్ట్ ఎల్లోస్టోన్ కు చెందిన జేమ్స్ సాసర్ జూనియర్ కొడుకు టేట్ చనిపోయాడు. టేట్ కొడుకు అలెక్స్ హరీకి 12 ఏళ్ల వయస్సు ఉంటుంది...

Montana : మనవడిని క్రూరంగా హింసించిన తాత.. 100 ఏళ్ల జైలు

Crime Nellore

Updated On : March 6, 2022 / 7:22 AM IST

Man Sentenced To 100 Years : మనవళ్లు, మనవరాళ్లను ప్రేమగా చూసుకోవాల్సిన ఓ తాత దారుణానికి ఒడిగట్టాడు. మనవడిని క్రూరంగా హింసించాడు. గంటల పాటు విచక్షణారహితంగా కొట్టడం, మానసికంగా హింసించడంతో ఆ మనవడు తనువు చాలించాడు. అత్యంత దారుణానికి ఒడిగట్టిన ఆ తాతకు వందేళ్ల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. ఫిబ్రవరి 2020లో చోటు చేసుకున్న ఈ ఘటన మొంటానాలో చోటు చేసుకుంది. వెస్ట్ ఎల్లోస్టోన్ కు చెందిన జేమ్స్ సాసర్ జూనియర్ కొడుకు టేట్ చనిపోయాడు. టేట్ కొడుకు అలెక్స్ హరీకి 12 ఏళ్ల వయస్సు ఉంటుంది.

Read More : Mahabubabad : కొడుతున్నారంటూ టీచర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండో తరగతి చిన్నోడు

ఈ క్రమంలోనే భార్యకు విడాకులు ఇచ్చేందుకు జేమ్స్ సస్సేర్ ప్రయత్నించాడు. విడాకులు తీసుకొంటే.. మనవడని చూడనివ్వని భార్య చెప్పడంతో జేమ్స్ వెనక్కి తగ్గాడు. తన మాటలు అస్సలు వినడం లేదని భర్త చెప్పడంతో జేమ్స్ మనవడిపై కక్ష, ధ్వేషం పెంచుకున్నాడు. దీంతో అతడిని వేధించసాగాడు. అక్కడ గడుపుతున్న రోజులు మొత్తం నరకాన్ని చూశాడు. మానసికంగా, శారీరకంగా హింసించడంతో అలెక్స్ తీవ్రంగా కృంగిపోయాడు. అంతేగాకుండా భోజనం కూడా పెట్టకపోవడంతో నీరసించిపోయి… 2020 ఫిబ్రవరిలో అలెక్స్ చనిపోయాడు. దీనిపై కేసు నమోదైంది. బాలుడి శరీరంపై మొత్తం గాయాలే ఉన్నాయని తేలింది. బాలుడిని తీవ్రంగా హింసించి.. క్రూరంగా హింసించడాన్ని జడ్జీ బ్రౌన్ ఆవేదన వ్యక్తం చేశారు. జేమ్స్ సస్సేర్ కు 100 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. తీర్పునిచ్చారు.