అమెజాన్ అలెక్సాను వాడుతూ దీపావళి రాకెట్‌ కాల్చిన యువకుడు.. ఆసక్తికర వీడియో 

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది

అమెజాన్ అలెక్సాను వాడుతూ దీపావళి రాకెట్‌ కాల్చిన యువకుడు.. ఆసక్తికర వీడియో 

Updated On : October 31, 2024 / 9:46 PM IST

దీపావళి వేళ ఎన్నో రకాల మతాబులను కాల్చుతూ చాలా సంతోషంగా గడుపుతాం. సాధారణంగా మతాబులకు మనిషి నిప్పు అంటించి దాన్ని పేల్చుతాడు. అయితే, ఓ యువకుడు చాలా వెరైటీగా అమెజాన్‌ అలెక్సాను ఉపయోగించి దివాళీ రాకెట్‌ను కాల్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు ఇప్పటికే 1.3 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో మణి ప్రాజెక్ట్స్ ల్యాబ్ ఈ వీడియోను షేర్ చేసింది. ఒక యువకుడు తన అమెజాన్ అలెక్సా డివైజ్‌తో మాట్లాడుతూ.. “అలెక్సా, రాకెట్‌ను లాంచ్‌ చేయి” అని చెబుతాడు.

దీంతో అలెక్సా స్పందిస్తూ “ఎస్‌ బాస్, రాకెట్‌ను ప్రయోగిస్తున్నాను” అని సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత ఆ దీపావళి రాకెట్‌ పైకి వెళ్లి పేలుతుంది. ఈ యువకుడు అలెక్సాను వాడుతూ రాకెట్‌ను పేల్చడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీపావలి టపాసులను ఇంత విభిన్నంగా కాల్చడంపై ఆ యువకుడిని అభినందిస్తున్నారు. మీరూ ఈ వీడియో చూడండి..

 

View this post on Instagram

 

A post shared by Mani’s Projects Lab (@manisprojectslab)

ఏడాదిగా యుద్ధం.. సైనికుల కొరతతో ఇజ్రాయెల్ అష్టకష్టాలు..!