వారం రోజుల వంట ఒకేసారి చేసిందని మహిళపై ట్రోలింగ్.. “సోమరివి” అన్నవారికి దిమ్మతిరిగే కౌంటర్..
ఆమె పోస్ట్, ఎంతో మంది వర్కింగ్ మహిళల మనసును హత్తుకుంది.

ఉద్యోగం, ఇల్లు, పిల్లల బాధ్యతలతో సతమతమయ్యే మహిళలకు రోజూ వేడివేడిగా వంట చేయడం ఒక పెద్ద సవాల్. ఈ సమస్యకు పరిష్కారంగా చాలామంది “మీల్ ప్రిప్పింగ్” (వారం వంట ముందుగానే చేయడం) పాటిస్తున్నారు.
బోస్టన్‌లో నివసించే మాధవి అనే ఒక భారతీయ మహిళ తన మీల్ ప్రిప్పింగ్ వీడియోను షేర్ చేయగా, అది ఊహించని వివాదానికి దారితీసింది. “సోమరివి,” “పాత భోజనం తింటావా?” అంటూ కొందరు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై మాధవి ఎలా స్పందించింది? ఆమెకు నెటిజన్లు, ప్రముఖులు ఎలా అండగా నిలిచారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏం జరిగింది? ఆ వీడియోలో ఏముంది?
బోస్టన్‌లో నివసించే మాధవి ఉద్యోగం చేస్తోంది. ఇంట్లో పిల్లలను కూడా ఆమె చూసుకోవాల్సి ఉంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్((@madhavis_little_nook))లో ఆమె తాజాగా ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె తన కుటుంబం కోసం వారం రోజులకు సరిపడా ఛోలే, లసాగ్నా, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ వంటి నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తూ కనిపించింది. సమయాన్ని ఆదా చేసుకునే ఈ పద్ధతి చాలా మందికి నచ్చినా, కొందరు మాత్రం నెగటివ్ కామెంట్లతో విరుచుకుపడ్డారు.
ట్రోలర్స్ విమర్శలు: “ప్రతిరోజూ తాజాగా వండుకోలేవా? ఎంత సోమరితనం”, “ఇవన్నీ పాత భోజనాలే కదా? ఫ్రిజ్‌లో పెట్టినవి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు”, “భారతీయ సంస్కృతిని పాడుచేస్తున్నారు” అంటూ పలువురు విమర్శలు గుప్పించారు.
ఈ కామెంట్లు చూసి బాధపడిన మాధవి, తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు కామెంట్స్ సెక్షన్‌ను డిసేబుల్ చేయాల్సి వచ్చింది. ట్రోలింగ్‌కు గురైన తర్వాత మాధవి ఒక మెసేజ్ పోస్ట్ చేసింది.
“ఈ కొన్ని గంటల్లో నాకు చాలా దారుణమైన, అసహ్యకరమైన కామెంట్స్ వచ్చాయి. అందుకే కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేశాను. వర్కింగ్ మామ్ లైఫ్ ఎంత ఒత్తిడిగా ఉంటుందో చాలామందికి అర్థం కాదు. పిల్లల పనులు, ఇంటి పనులు, ఆఫీస్ పనుల మధ్య రోజూ వంట చేయడం ఒక పెద్ద టాస్క్. మీల్ ప్రిప్పింగ్ నా పనిని సులభం చేస్తుంది, నాకు కాస్త రిలీఫ్ ఇస్తుంది” అని చెప్పింది.
ఆమె పోస్ట్, ఎంతో మంది వర్కింగ్ మహిళల మనసును హత్తుకుంది. మాధవికి పలువురు నెటిజన్లు, ప్రముఖులు అంగా నిలిచారు. ఈ వివాదం రెడ్డిట్ (Reddit), ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు పాకింది. అక్కడ మాధవికి విపరీతమైన మద్దతు లభించింది.
Also Read: మార్కెట్లో దుమ్ముదులుపుతున్న iQOO 5G స్మార్ట్‌ఫోన్.. ఆఫర్లు చూస్తే షాక్ అవుతారు..
ప్రముఖ రచయిత క్రిష్ అశోక్ (@masalalab) మద్దతు
ప్రముఖ రచయిత, కంటెంట్ క్రియేటర్ క్రిష్ అశోక్.. మాధవికి మద్దతుగా నిలుస్తూ, మీల్ ప్రిప్పింగ్ అనేది శ్రమను తగ్గించుకునే ఒక తెలివైన పద్ధతి అని పేర్కొన్నారు.
ఒక యూజర్ ఇలా రాశారు: “ఇది కూడా ఇంట్లో వండిన తాజా భోజనమే. బయట జంక్ ఫుడ్ తినడం కంటే ఇది వంద రెట్లు మేలు. ఇందులో తప్పేముంది?” అని అన్నారు.
మరొక మహిళ స్పందిస్తూ: “నేను కూడా 4-5 రోజులకు కూరలు వండి ఫ్రిజ్‌లో పెట్టుకుంటాను. రోజూ వేడివేడిగా అన్నం లేదా రోటీ చేసుకుంటాను. ఇది నాకు చాలా సమయాన్ని ఆదా చేస్తుంది” అన్నారు.
ఇంకొకరు స్పందిస్తూ.. “ఆమె తన కుటుంబం కోసం వంటలు చేసుకుంటే, సంబంధం లేని వాళ్లకి ఎందుకు అంత బాధ? ఫ్రిజ్ ను కనిపెట్టిందే ఆహారాన్ని నిల్వ చేయడానికి కదా” అని ప్రశ్నించారు.
ఒక NRI యూజర్: “విదేశాల్లో ఉండే మాకు, ఇలా ఇంట్లో వండిన భారతీయ భోజనం దొరకడమే ఒక వరం.”
ఒక మహిళ తన శ్రమను తగ్గించుకోవడానికి, కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఒక మార్గాన్ని ఎంచుకుంటే, దాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని చాలా మంది కామెంట్లు చేశారు.
This meal prep creator got so much hate that she turned off comments ft @madhavis_little_nook
byu/National_Holobird inInstaCelebsGossip