Indian-origin Journalist: అమెరికాలో భారత సంతతి జర్నలిస్ట్‌కి ప్రతిష్టాత్మక అవార్డు
భారతీయ సంతతికి చెందిన మహిళా జర్నలిస్ట్ మేఘ రాజగోపాలన్‌కు పులిట్జర్ అవార్డు లభించింది. జర్నలిజంలో ప్రపంచంలో అతిపెద్ద అవార్డుగా పరిగణించే ఈ అవార్డును ఈ ఏడాది మేఘ రాజగోపాలన్ దక్కించుకున్నారు.

Megha Rajagopalan An Indian Origin Journalist Won Pulitzer Prize
Megha Rajagopalan: భారతీయ సంతతికి చెందిన మహిళా జర్నలిస్ట్ మేఘ రాజగోపాలన్‌కు పులిట్జర్ అవార్డు లభించింది. జర్నలిజంలో ప్రపంచంలో అతిపెద్ద అవార్డుగా పరిగణించే ఈ అవార్డును ఈ ఏడాది మేఘ రాజగోపాలన్ దక్కించుకున్నారు.
చైనా నిర్బంధ శిబిరాల వాస్తవాలను ప్రపంచానికి వెల్లడించడంలో కీలకపాత్ర పోషించారు మేఘ రాజగోపాలన్. మేఘ రాజగోపాలన్ ఉపగ్రహ ఫోటోలను విశ్లేషించి, చైనా మిలియన్ల మంది ఉయ్ఘర్ ముస్లింలను ఎలా ఖైదు చేసిందో ఆర్టికల్స్ రాశారు.
ఈ క్రమంలోనే అమెరికాలో వార్తాపత్రిక, పత్రికా ఆన్‌లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీత కూర్పులలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు పులిట్జర్ కాగా.. మేఘ రాజగోపాలన్ మరో ఇద్దరితో కలిసి ఈ అవార్డును గెలుచుకున్నారు.
అమెరికా బజ్‌ఫీడ్ న్యూస్ సంస్థలో పని చేస్తున్న మేఘ.. అలిసన్ కిల్లింగ్, క్రిస్టో బుస్చెక్ తమ పరిశోధనాత్మక కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించారు. మేఘ వార్తలను తీవ్రంగా పరిగణించిన చైనా.. ఆమెను సైలెంట్‌గా ఉంచేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.