చైనా సాధించింది.. లోకల్‌లో కరోనా కేసుల్లేవ్

చైనా గురువారం సంచలనమైన సంతోషకరమైన ప్రకటన చేసింది. కరోనా వైరస్ సంక్షోభం మొదలైన తర్వాత తొలిసారి లోకల్‌లో కేసులు నమోదవడం లేదని తెలిపింది. మూడు నెలలుగా చైనాను పట్టి పీడిస్తున్న కరోనా.. లోకల్‌లో ఎవరికీ రావడం లేదని.. ఒకవేళ సంక్రమిస్తే అది విదేశీయుల నుంచే రావాలనే నమ్మకాన్ని వ్యక్తపరిచింది. చైనాలోనే పుట్టిన కరోనా.. అక్కడ అదుపులోకి వచ్చినప్పటికీ ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో విజృంభిస్తుంది.
గురువారం చైనాలో 34కేసులు నమోదయ్యాయి. అవి కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. అయితే అప్పుడే చైనా ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పలేం. ఓ 14రోజులు పరిశీలిస్తేనే గానీ, కొత్త ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా లేదా అనేది చెప్పలేమంటున్నారు నిపుణులు. దేశంలో ట్రావెల్ నిబంధనలు ఎత్తేసి రోజువారీ జీవితాలు యథాస్థితికి వచ్చాక కరోనా మళ్లీ అటాక్ అయ్యే ప్రమాదం ఉంది.
See Also | డాక్టర్‌కు కరోనా లక్షణాలు.. చికిత్స ఇవ్వమని చేతులెత్తేసిన 4హాస్పిటళ్లు
చైనాలో తీసుకున్న చర్యలు.. ఇన్ఫెక్షన్లు రాకుండా ఆపింది. తొలిసారి అటాక్ అయితే ఈ ప్రభుత్వం బాగానే ఆపగలిగింది. రెండోసారి అటాక్ అయితే ఏం చేస్తుందా అనేది చూడాలని హాంకాంగ్ యూనివర్సీటీ హెడ్ బెన్ కౌలింగ్ అంటున్నారు. వైరస్ గురించి తీసుకున్న జాగ్రత్తలే ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నాయి.
మూడు నెలలుగా గృహ నిర్భందంలో ఉండి.. జన సంచారం తగ్గిపోవడంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని దాని నుంచి కోలుకునే ప్రయత్నాలుచేస్తుంది చైనా. అమెరికన్ అయిన స్టీఫెన్ కిర్కెబీ ఓ యుద్ధం ముగిసినట్లు ఉందని అన్నారు. తన భార్య కుటుంబాన్ని కలిసేందుకు చైనా వెళ్లిన అతను జనవరిలో లాక్ డౌన్ ప్రకటించిడంతో తిరిగి అమెరికా వెళ్లలేకపోయారు. ప్రస్తుతం స్థానికంగా ప్రజలకు తిరిగే స్వేచ్ఛ ఇచ్చింది చైనా ప్రభుత్వం.