Biggest suicide note : 1,905 పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోయిన వ్యక్తి .. ఎవరో తెలుసా?

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయంలో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. కానీ ఓ యువకుడు తను చనిపోవాలని నిర్ణయించుకున్న 5 సంవత్సరాల తర్వాత అతి పెద్ద సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. ఇది ఇప్పటి విషయం కానప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది.

Biggest suicide note : 1,905 పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోయిన వ్యక్తి .. ఎవరో తెలుసా?

Biggest suicide note

Updated On : July 21, 2023 / 5:07 PM IST

Biggest suicide note : కొంతమంది సమస్యలను ఎదుర్కోలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఒక్క నిముషం ఆలోచించి ఉంటే ఈ పని చేసి ఉండేవారు కాదని బాధపడతాం. అయితే మిచెల్ ఎల్. హీస్‌మాన్ అనే వ్యక్తి తాను బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయం తీసుకుని 1,905 పేజీల లేఖ రాయడమే కాదు.. అందుకోసం 5 సంవత్సరాల సమయం తీసుకున్నాడట. ఇంత సమయంలో కూడా అతనికి బ్రతకాలనే ఆలోచన లేకపోవడం దురదృష్టకరం.

Letter Reached After 30 years : తపాలా శాఖ ఘనకార్యం..30 ఏళ్ల తర్వాత అందిన ఉత్తరం..! రాసినవారు,అందుకోవాల్సిన ఇద్దరూ..

1975 లో న్యూయార్క్ లో పుట్టిన హీస్‌మాన్  N.J మన్రో టౌన్ షిప్‌లోని స్కూల్లో చదువుకున్నాడు. అల్బానీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నాడు. 35 వ ఏట హీస్‌మాన్  బలవన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది 2010 వ సంవత్సరం నాటి ఘటన అయినా ఇప్పటికీ అతను రాసిన సూసైడ్ నోట్ అతడిని గుర్తుండిపోయేలా చేసింది. మెమోరియల్ మెట్లపై తనను తాను కాల్చుకుని చనిపోయిన హీస్‌మాన్ 1,905 పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోయాడట. అప్పట్లో యూనివర్సిటీ అధికారులు తమ సంతాపాన్ని తెలిపారు.

Sanjay Nishad to PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రక్తంతో లేఖ రాసిన కేంద్ర మంత్రి.. ఎందుకో తెలుసా?

హీస్‌మాన్ 1700 కంటే ఎక్కువగా సూచనలు, జర్మన్ తత్త్వవేత్త  ఫ్రెడరిక్ నీట్జ్‌చే గురించి 200 సూచనలు రాశాడట. జీవితం అర్ధం లేనిదని.. అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్ జెఫెర్సన్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్‌ల పేర్లు గుర్తు చేశాడట. ఇంకా ఫిలాసఫీ, కాస్మాలజీ, సింగులారిటీ, న్యూజెర్సీ, హౌ టూ బ్రీడ్ ఎ గాడ్ వంటి శీర్షికలతో రాసుకొచ్చాడట. మనస్తత్వ శాస్త్రంలో పట్టా తీసుకుని కూడా జీవితంపై ఒక విధమైన విరక్తితో అంత పెద్ద నోట్ రాసి చనిపోయాడు హీస్‌మాన్. అతను రాసిన అతిపెద్ద లెటర్‌ను చదవడానికి ఇప్పటికీ చాలామంది ఆసక్తి కనపరుస్తారు.